ప్రముఖ బుల్లితెర యాంకర్ రష్మి తన టీవీ షోలతో ఓ పక్క బిజీగా గడుపుతూనే మరోపక్క సినిమాల్లో కూడా నటిస్తోంది. బుల్లితెరపై తన హాట్ హాట్ అందాలతో ఆకట్టుకునే ఈ బ్యూటీ తరచూ తన అభిమానులతో సోషల్ మీడియాలో చిట్ చాట్ చేస్తుంటుంది. తాజాగా కొందరు నెటిజన్లు ఆమెను అడిగిన ప్రశ్నలు ఇబ్బందికరంగా అనిపించినా.. వాటికి ధీటుగా సమాధానాలు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ముందుగా.. 

నెటిజన్: ఒకవేళ ఎవరైనా మీరు కోరిన దానికంటే ఎక్కువ డబ్బిచ్చి ఒక రాత్రి తమతో గడపమంటే ఏం చేస్తావు..? 
రష్మి: నిజానికి అది అడిగిన వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది. 

నెటిజన్: అంటే అతడిని యాక్సెప్ట్ చేస్తావా..?
రష్మి: కుదరదని చెప్తా.. 

నెటిజన్: ఈ ఏడాది మొత్తం సెలబ్రిటీల పెళ్లిళ్ళతో గడిచిపోయింది. నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావు..? 
రష్మి: నాకు ముందు బేబీ కావాలి.. ఆ తరువాతే పెళ్లి. కాబట్టి నా అంచనా ప్రకారం త్వరలోనే జరుగుతుంది. 

నెటిజన్: షూటింగ్ స్పాట్ లో మీకు ఇష్టమైన పార్ట్ ఏంటి..? 
రష్మి: లంచ్ బ్రేక్ 

ఇలా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకొచ్చింది. 

సుమ, అనసూయ, రష్మిల రెమ్యునరేషన్ ఎంతంటే..?

వివాదంలో రష్మి...లీగల్ గా ప్రొసీడ్ అవుతానంటూ వార్నింగ్

​​​​​​​సుధీర్ తో నేనా..? యాంకర్ రష్మి కామెంట్స్!