యాంకర్ రష్మి, సుధీర్ ల మధ్య బుల్లితెరపై కెమిస్ట్రీ ఓ రేంజ్ లో పండుతుంది. వీరి కాంబినేషన్ లో షో అంటే అది పక్కా హిట్ అనే నమ్మకం అందరిలో ఉంటుంది. ఇక వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని ఇలా రకరకాల వార్తలు వస్తున్నప్పటికీ వాటిని ఈ జంట కొట్టిపారేసింది.

ప్రస్తుతం ఈ ఇద్దరూ కలిసి ప్రముఖ ఛానెల్ లో ప్రసారితమవుతున్న 'ఢీ జోడి' ప్రోగ్రామ్ కి యాంకర్స్ గా పని చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా తిరుపతిలో ఈ నెల 9న 10కె రన్ ఉందని.. దీనికి ముఖ్య అతిథులుగా సుధీర్, రష్మి హాజరుకానున్నట్లు ఓ పోస్టర్ ని సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు.

ఈ సంగతి రష్మి వరకు వెళ్లడంతో దీనిపై స్పందించింది ఈ హాట్ యాంకర్. ఇదొక ఫేక్ న్యూస్ అని కొట్టిపారేసింది. ఈ విషయమై తనను ఎవరూ సంప్రదించలేదని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

'నాకు ఈ ఈవెంట్ కి ఎలాంటి సంబంధం లేదు. నన్ను ఎవరూ దీని గురించి సంప్రదించలేదు. నాకు చెప్పకుండానే పోస్టర్ లో నా ఫోటో పెట్టి ఈవెంట్ కి హాజరవుతున్నట్లు పోస్ట్ చేశారు. దీని స్పాన్సర్స్ ఎవరైనా ఉంటే వారికి తెలియజేయండి' అంటూ చెప్పుకొచ్చింది.