జబర్దస్త్ పోగ్రాం ద్వారా పాపులర్ అయిన రష్మికు యూత్ లో ఉన్న క్రేజ్ తెలిసిందే. దాన్ని ఆమె మాత్రమే కాకుండా వేరే వాళ్లు కూడా క్యాష్ చేసుకోవాలని చూడటం దగ్గరే సమస్య వస్తోంది. ఆమె తనకున్న ఫాలోయింగ్ తో అనేక ప్రారంభోత్సవ కార్యక్రమాలు, ఈవెంట్స్ లో  కూడా సందడి చేస్తోంది. ఆమె తాను వస్తున్నానని కన్ఫర్మ్  చేసి హోర్డిగ్స్ పెట్టుకుంటే ఇబ్బంది లేదు. కానీ ఆమెను పిలవకుండానే రేష్మి వస్తోందంటూ హోర్డింగ్స్ పెట్టి పబ్లిసిటీ చేసి జనాలని మోసం చేయాలనుకుంటే ఇబ్బందే. 

ఈరోజు (ఆదివారం) తిరుపతిలో జరగనున్న ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రష్మి హాజరు కాబోతున్నారని  హోర్డింగ్‌ ఏర్పాటు చేశారు. ఈ హోర్డింగ్ ఫొటోను చూసిన రష్మి వెంటనే ట్విటర్‌లో  ఖండించారు. అసలు ఆ ఈవెంట్ నిర్వాహకులు తనను సంప్రదించలేదని స్పష్టం చేశారు. 

ఆమె ట్వీట్ చేస్తూ..‘ఈ ఈవెంట్‌లో నా భాగస్వామ్యం లేదు. నా ఫర్మిషన్, ప్రమేయం లేకుండా నా ఫొటోల్ని పెట్టేస్తారు. కార్యక్రమం స్పాన్సర్లు ఎవరైనా తెలిస్తే ఈ వార్త తెలియజేయండి’ అని రష్మి  అన్నారు.

దీంతో సదరు ఆ పోగ్రామ్ ని  నిర్వహిస్తున్న వ్యక్తి రష్మికి రిప్లై ఇచ్చారు. ‘ఈ కార్యక్రమానికి వచ్చేందుకు మేం రష్మికి అడ్వాన్స్‌ కూడా ఇచ్చాం. ఆమె రావడానికి ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు దాన్ని ఖండిస్తున్నారు. నేను ఆమె మేనేజర్‌కు డబ్బులు పంపా.. ఆధారాలు కూడా ఉన్నాయి చూడండి. దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటా’ అంటూ కొన్ని స్క్రీన్‌ షాట్లు పంపారు. 

వెంటనే ఆయన మాటలకు రష్మి రిప్లై ఇచ్చారు. ఏదైనా మాట్లాడేముందు కాస్త నిజానిజాలు తెలుసుకోవాలని అన్నారు. ఆయన చేస్తున్న కామెంట్స్  అబద్ధాలుగా తేలుతాయని, లీగల్ గా చర్యలు తీసుకోవాలంటే అలానే చేయండని చెప్పారు. మరి ఈ వివాదం ఎక్కడికు వెళ్లి ఆగుతుందో చూడా