యాంకర్ గా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సినిమాలను మాత్రం వదలడం లేదు అనసూయ. ఇప్పటివరకు ఆమె నటించిన సినిమాలన్నీ మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. రీసెంట్ గా 'ఎఫ్ 2' సినిమాలో ఐటెం సాంగ్ లో నటించింది ఈ బ్యూటీ. ఐటెం సాంగ్, ఒక సీన్ లో కనిపించిన అనసూయని చూసి అభిమానులు కాస్త అప్సెట్ అయ్యారు.

తమ అభిమాన నటి ఒక్క సన్నివేశానికి మాత్రమే పరిమితమవ్వడం వారిని బాధించింది. ఇప్పుడు వారి నిరాశని దూరం చేయడానికి వైఎస్సార్ బయోపిక్ 'యాత్ర' ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాలో ఆమె డీగ్లామరస్ రోల్ లో కనిపించనుంది. కర్నూలు ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పాత్రని పోషిస్తోంది అనసూయ. 'యాత్ర' సినిమాలో ఎక్కువగా వైఎస్సార్ పాదయాత్ర గురించి చూపించబోతున్నారు. దానికారణంగా ఆయన 2004 ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎలా అయ్యాడనే అంశాలను టచ్ చేస్తున్నారు. అయితే 2004 నుండి 2014 వరకు వైఎస్సార్ పార్టీ తరఫున చరితారెడ్డి సృష్టించిన రికార్డులను ఈ కథలో ప్రస్తావించబోతున్నారు.

2004లో ఆమె నందికొత్కూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్ల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఎలా ఎదుర్కొంది..? అలానే 2014లో పన్యం నియోజకవర్గం నుండి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాటసాని రమాభూపాల్ రెడ్డిని వైఎస్సార్ పార్టీ తరఫున ఎలా ఓడించిందనే విషయాలను కథలో ప్రస్తావిస్తూ.. అనసూయ పాత్రను చాలా బలంగా తెరపై చూపించబోతున్నారట. ఫిబ్రవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి డైనమిక్ లేడీఎమ్మెల్యే పాత్రలో అనసూయ ఎంతగా ఒదిగిపోయిందో చూడాలి!

'యాత్ర'లో విజయమ్మ లుక్..!

'యాత్ర' ఆడియో కు ఛీఫ్ గెస్ట్ ఎవరు?

వైఎస్సార్ బయోపిక్: 'యాత్ర' టీజర్!

ఎన్టీఆర్ కి పోటీగా 'యాత్ర'.. తప్పు చేస్తున్నారా..?