దివంగత మాజీ ముఖ్యమంతి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రతో దర్శకుడు మహి వి రాఘవ్ 'యాత్ర' బయోపిక్ ని రూపొందిస్తున్నాడు. సినిమా మొత్తం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చుట్టూనే నడుస్తుందని తెలుస్తోంది.

వైఎస్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ నటించారు. ఇప్పటికే సినిమాల లుక్ కి సంబంధించిన ప్రోమోలు, పోస్టర్లు విడుదలయ్యాయి. తాజాగా వైఎస్ భార్య విజయమ్మ లుక్ రిలీజ్ చేసి మరిన్ని అంచనాలను పెంచేసింది చిత్రబృందం.

విజయమ్మ పాత్రలో నటి ఆశ్రిత వేముగంటి నటిస్తున్నారు. సినిమాలో ఆమె లుక్ అచ్చం విజయమ్మని తలపిస్తోంది. ఈ పోస్టర్ ని బట్టి సినిమాలో పాత్రల విషయంలో దర్శకుడు ఎంతగా జాగ్రత్తలు తీసుకున్నాడో.. అర్ధమవుతోంది.

కొద్దిగంటల్లో సినిమా ట్రైలర్ ని విడుదల చేయనున్నారు. విజయ్ చల్లా, శశి దేవిరెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాను ఫిబ్రవరి 8న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.