మనకు ఉన్న అతి కొద్ది యాంకర్లలో అనుసూయ ఒకరు. ఈ అమ్మడు ఏం చేసిన సెన్సేషనే. రీసెంట్ గా రంగమ్మత్త క్యారెక్టర్ తో అద్భుతమై పేరు తెచ్చుకుంది.అమ్మడికి పెళ్లైనా సరే తన క్రేజ్ ను ఏ మాత్రం తగ్గించుకోలేదు. ఒక సెలబ్రెటీగా తన జీవితాన్ని ఎంత హుందాగా ఉంచుకుంటుందో అలాగే వ్యక్తిగత జీవితాన్ని అదే స్థాయిలో సంతోషంగా ఉంచుకుంటుంది. రీసెంట్ గా తన కుటుంబ సభ్యులతో గడిపిన ఆనంద క్షణాలను అమ్మడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. సముద్రపు ఒడ్డున బీచ్ లో అందమైన  సన్ సెట్ లో దిగిన ఫొటోలు నెటిజన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. 

ముఖ్యంగా ఆమె భర్తతో దిగిన ఒక ఫొటో అయితే ఎంతో రొమాంటిక్ గా ఉందని నెటిజన్స్ ఎక్కువగా కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఆమె సహా యాంకర్ రష్మీ గౌతమి కూడా అనసూయ పిక్స్ పై పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యింది. రష్మీ పుట్టిన రోజు కావడంతో అనసూయ స్పెషల్ గా ఆమెకు విషెస్ అందించింది. దీంతో రష్మీ కూడా అనసూయ సింగిల్ ఫొటో తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది.