మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం హిందీలో కూడా పెద్దఎత్తున రిలీజవుతోంది. అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించడంతో నార్త్ లో కూడా సైరాపై మంచి అంచనాలు ఉన్నాయి. సైరా ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవితో కలసి బిగ్ బి అమితాబ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. 

సైరా చిత్రాన్ని నార్త్ లో రిలీజ్ చేస్తున్న నటుడు ఫరాన్ అక్తర్ ఈ ఇంటర్వ్యూ చేయడం విశేషం. ఇటీవల చిరంజీవి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. కమల్, రజనీ లాంటి స్టార్స్ రాజకీయాల్లోకి వెళ్లి సమయం వృధా చేసుకోవద్దని.. ప్రస్తుతం పాలిటిక్స్ డబ్బు, కులం ఆధారంగా సాగుతున్నాయని కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. 

తాజాగా ఇంటర్వ్యూలో అమితాబ్ మాట్లాడుతూ.. చిరంజీవి రాజకీయాల్లోకి వెళుతున్నట్లు చెప్పినప్పుడు నేను వద్దని చెప్పా. అయినా కూడా నా మాటవినలేదు అని అమితాబ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.దీనికి అవును నిజమే.. రాజకీల్లోకి వెళ్లి బాధపడ్డా అని చిరంజీవి అంగీకరించారు. 

ఇదే సలహాని రజనీకాంత్ కు కూడా ఇస్తున్నా.. ఆయన కూడా వినడం లేదు అని అమితాబ్ వ్యాఖ్యానించడం ఆసక్తిగా మారింది. 

చిరంజీవి కోసం ఫ్యామిలీ మొత్తం.. పవన్ క్రేజ్ పై అమితాబ్ కామెంట్స్!

తమన్నాతో రాంచరణ్ కామెడీ.. సైరాలో వాళ్ళిద్దరి సీన్స్ ఎలా ఉంటాయంటే!

మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించిన ఉయ్యాలవాడ వారసులు!

నరసింహారెడ్డి కాదు అని నిరూపించగలరా.. పరుచూరి ఛాలెంజ్!