2025లో నిర్మాతలను భయపెట్టిన టాప్ 4 డిజాస్టర్ సినిమాలు
Top 4 Flop Movies 2025 : అభిమానుల అంచనాలను తలకిందులు చేసి, 2025లో నిర్మాతలను భపెట్టిన టాప్ 4 సినిమాలేంటో తెలుసా? స్టార్ హీరోలు నటించిన ఈ సినిమాలు ఎందుకు ప్లాప్ అయ్యాయి?

2025 లో అభిమానులను నిరాశపరిచిన సినిమాలు
2025లో భారీ అంచనాలతో విడుదలైన కొన్ని సినిమాలు విజయం సాధించాయి. కానీ కొన్ని చిత్రాలు పెద్ద స్టార్లు నటించినా, వసూళ్లు, పరంగా వెనుకబడ్డాయి. ఆ సినిమాలేంటి, ఎందుకు ఫ్లాప్ అయ్యాయి. నిర్మాతలకు నష్టాలు మిగిల్చిన మూవీస్ ఏంటి?
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్, కియారా అద్వానీ నటించిన 'గేమ్ ఛేంజర్' బడ్జెట్ 450 కోట్లు. ఇది భారతదేశంలోనే అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటి. కానీ బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.131 కోట్లు వసూలు చేసింది. నిర్మాత దిల్ రాజుకు నష్టాలు మిగిల్చింది మూవీ.
పట్టుదల (విడాముయర్చి)
అజిత్ కుమార్ నటించిన పట్టుదల ( విడాముయర్చి) బడ్జెట్ రూ.138-200 కోట్లు. కానీ బాక్సాఫీస్ వద్ద రూ.125 కోట్లు మాత్రమే వసూలు చేసి భారీ ఫ్లాప్‌గా నిలిచింది. లైకా ప్రొడక్షన్స్‌కు ఇది పెద్ద నష్టాన్ని మిగిల్చింది.
థగ్ లైఫ్
కమల్ హాసన్, సింబు, మణిరత్నం కాంబోలో వచ్చిన 'థగ్ లైఫ్' బడ్జెట్ రూ.200 కోట్లు. కానీ, కేవలం రూ.97 కోట్లు మాత్రమే వసూలు చేసి భారీ నష్టాలను మిగిల్చింది. కథలో ఆసక్తి లేకపోవడమే ఫ్లాప్‌కు కారణం.
రెట్రో
కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'రెట్రో'. రూ.65 కోట్ల బడ్జెట్‌తో సూర్య సొంత నిర్మాణ సంస్థ నిర్మించింది. భారీ అంచనాలతో విడుదలై, వాణిజ్యపరంగా నిరాశపరిచింది.

