చిరంజీవి, రాంచరణ్ తో పాటు ఇతర సైరా చిత్ర యూనిట్ చెన్నైలో ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ లో రాంచరణ్, తమన్నా మధ్య సరదా సంభాషణ సాగింది. రాంచరణ్ మాట్లాడుతూ నా ఫేవరేట్ నటి తమన్నా ఈ చిత్రంలో నటించింది అని చరణ్ తెలిపాడు. దీనికి తమన్నా స్పందిస్తూ కేవలం ఫేవరెట్ మాత్రమేనా నేను మోస్ట్ ఫేవరెట్ అని తమన్నా తెలిపింది. అవును నిజమే అంటూ చరణ్ సరదాగా ఒప్పుకున్నాడు. 

ఇక తమన్నా మాట్లాడుతూ.. ఇలాంటి భారీ చిత్రంతో నయనతారతో కలసి స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా ఇద్దరి మధ్య చాలా అద్భుతమైన సన్నివేశాలు ఉన్నాయి. అలాగే ఇద్దరి పాత్రలు చాలా పవర్ ఫుల్ గా ఉంటాయని తమన్నా తెలిపింది. 

చిరంజీవి తన ప్రసంగంలో విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ చిత్రంలో అతడి పాత్ర మరిచిపోలేనిది. విజయ్ సేతుపతి ఎంత బిజీ నటుడో నాకు తెలుసు. అయినా కూడా సైరా నటించేందుకు అంగీకరించాడు. విజయ్ సేతుపతి సింప్లిసిటీకి తాను ఆశ్చర్యపోయినట్లు చిరంజీవి ప్రశంసించారు.