- Home
- Entertainment
- Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్.. కట్ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది
Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్.. కట్ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది
రాజశేఖర్ యాంగ్రీ యంగ్ మేన్‌గా రాణించి మెప్పించారు. స్టార్ హీరోగా రాణించారు. ఆ సమయంలో డాడీ అని పిలిచిన నటితోనే ఆ తర్వాత రొమాన్స్ చేశాడు. ఆ కథేంటో తెలుసుకుందాం.

క్యారెక్టర్స్ కి రెడీ అయిన రాజశేఖర్
హీరో రాజశేఖర్ కొంత గ్యాప్ తర్వాత కమ్ బ్యాక్ కాబోతున్నారు. ఆయన ఈ మధ్య కాలంలో హీరోగా నటించిన సినిమాలు పెద్దగా ఆడలేదు. దీంతో బలమైన రోల్స్ చేసేందుకు రెడీ అయ్యారు. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా నటించిన `బైకర్` మూవీలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. దీంతోపాటు మరో రెండు సినిమాల్లో ఆయన హీరోగా నటిస్తున్నట్టు సమాచారం. ట్రెండ్‌కి తగ్గట్టుగా సినిమాలు చేసేందుకు రాజశేఖర్ ప్రిపేర్ అవుతుండటం విశేషం.
కూతురిగా చేసిన హీరోయిన్‌తో రొమాన్స్
ఇదిలా ఉంటే చిత్ర పరిశ్రమలో హీరోహీరోయిన్ల విషయంలో విచిత్రమైన పరిస్థితులు చోటు చేసుకుంటాయి. చెల్లిగా నటించిన నటితోనే రొమాన్స్ చేసే పరిస్థితి వస్తుంది. హీరో పక్కన రొమాన్స్ చేసిన హీరోయిన్‌కి కొడుకుగా నటించాల్సి వస్తుంది. సినిమా కథలను బట్టి క్యారెక్టర్స్ మారిపోతాయి. ఏ పాత్ర అయినా నటీనటులు చేయాల్సింది. ఆ విషయంలో బౌండరీలు ఉండవు. అదే సినిమాల్లో ఉన్న గొప్పతనం. అయితే కూతురిగా నటించిన అమ్మాయితోనే ఆ తర్వాత రొమాన్స్ చేయాల్సి రావడం కూడా జరుగుతుంటుంది. ఇలాంటి అరుదైన సంఘటనలు చాలా మంది హీరోలు ఫేస్ చేశారు. శ్రీదేవి, ఎన్టీఆర్ విషయంలో ఇలానే జరిగింది. ఇలా రాజశేఖర్ విషయంలో కూడా జరిగింది.
`మమతల కోవెల` చిత్రంలో కూతురుగా నటించిన రాశి
రాజశేఖర్.. డాడీ అని పిలిపించుకున్న అమ్మాయితోనే రొమాన్స్ చేయడం గమనార్హం. రాజశేఖర్ ఇప్పుడు హీరోగా కాస్త డౌన్ అయ్యారు. కానీ ఒకప్పుడు స్టార్ హీరోగా రాణించారు. టాలీవుడ్‌లో టాప్ హీరోల్లో ఒకరిగా రాణించారు. ఈ క్రమంలో ఆయన 1989లో `మమతల కోవెల` చిత్రంలో నటించారు. ఇందులో సుహాసిని హీరోయిన్. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద డీసెంట్‌గా ఆడింది. ఈ మూవీలో హీరోయిన్ రాశి.. రాజశేఖర్ కి కూతురుగా నటించింది. డాడీ డాడీ అని పిలుస్తూ మెప్పించింది. బేబీ విజయగా ఆమె కనిపించింది.
నేటి గాంధీలో రాశితో రాజశేఖర్ రొమాన్స్
అయితే సరిగ్గా పదేళ్ల తర్వాత రాజశేఖర్ సరసన రొమాన్స్ చేసింది రాశి. రాజశేఖర్ హీరోగా వచ్చిన `నేటి గాంధీ` చిత్రంలో రాశి హీరోయిన్‌గా నటించింది. ఇందులో భారతి పాత్రలో హీరోయిన్‌గా నటించింది. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. డ్యూయెట్లు పాడుకుంటారు. మొదట ఓ రౌడీ వద్ద పనిచేసిన హీరో, హీరోయిన్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత మారిపోతాడు. విలన్‌గా నుంచి హీరోగా మారిపోతాడు. ఇందులో రాజశేఖర్, రాశిల మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. ఈవీవీ సత్యనారాయణ రూపొందించిన ఈ చిత్రం యావరేజ్‌గా ఆడింది.
సెకండ్ ఇన్నింగ్స్ లో జోరు పెంచిన రాశి
ఇలా `మమతల కోవెల` చిత్రంతో రాజశేఖర్‌కి కూతురుగా నటించిన రాశి.. పదేళ్ల తర్వాత `నేటి గాంధీ` మూవీలో హీరోయిన్‌గా నటించి రొమాన్స్ చేసింది. ఇదే సినిమాల్లో ఏదైనా జరుగుతుందని చెప్పడానికి నిదర్శనం. రాశి ఒకప్పుడు దాదాపు అందరు టాప్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్‌గా రాణించింది. ఓ వెలుగు వెలిగింది. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీముణిని పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ అయ్యింది. దీంతో సినిమాలకు దూరమయ్యింది. మళ్లీ కొంత గ్యాప్ తో ఇటీవల నటిస్తోంది. సీరియల్స్ చేస్తోంది. సినిమాల్లోనూ నటించేందుకు రెడీగా ఉంది. అవకాశాల కోసం వెయిట్ చేస్తోంది రాశి.

