ప్రముఖ కన్నడ నటుడు, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబరీష్(66) మృతి చెందారు. గత కొంతకాలంగా కిడ్నీ, శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఆయన మృతిపై పలువురు సినీ రాజకీయనాయకులు సంతాపం ప్రకటించారు. ఇది ఇలా ఉండగా.. ఆయన రెండు ఆశలు తీరలేదనే బెంగ మాత్రం అభిమానుల్లో అలాగే ఉండిపోయింది. మహానటుడు రాజ్ కుమార్ కళాకారుల సంఘాన్ని నిర్మించాలని అనుకున్నారు.

ఆయన ఆశని అంబరీష్ పూర్తి చేసి కళాకారుల ఐక్యవేడుకకు భవనాన్ని కానుకగా ఇచ్చారు. ఆ భవనంలో కళాకారుల సంఘంతో కన్నడ రాజ్యోత్సవ వేడుకలు జరపాలని అనుకున్నారు. శనివారం సాయంత్రం జరపాలనుకున్న ఈ వేడుకని కొన్ని కారణాల వలన వాయిదా వేశారు. అదే సమయంలో ఆయన గుండెపోటుతో మరణించారు.

ఇటీవల 'అంబి నింగ్ వయసాయ్తు' తెలుగులో అంబి నీకు వయసైంది అనే సినిమాలో నటిస్తూన్న సమయంలో నాకు వయసైందని ప్రేక్షకులకు చూపిస్తున్నారని ఇక సినిమాలలో నటించానని దర్శకులకి తేల్చిచెప్పారు.

తన కుమారుడిని హీరోగా చేయాలని నిర్ణయించుకొని సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. ఒక షెడ్యూల్ కూడా పూర్తి కాకముందే ఆయన కన్నుమూశారు. ఇలా ఆయన రెండు కోరికలు తీరకుండానే అంబరీష్ మృతి చెందారు. 

ప్రముఖ నటుడు, మాజీ మంత్రి అంబరీష్ కన్నుమూత

అంబరీష్ మరణం: కన్నీటి పర్యంతమైన మెగాస్టార్ - మోహన్ బాబు!