బెంగళూరు: ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి అంబరీష్ కన్నుమూశారు. ఆయన వయస్సు 66 ఏళ్లు. గత కొంత కాలంగా ఆయన ఆరోగ్యం సరిగా లేదు.

గుండెపోటు రావడంతో ఆయనను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. అభిమానులు ఆయనను అబీ అని ముద్గుగా పిలుచుకుంటారు. ఐదు దశాబ్దాల పాటు సినీ రంగంలో ఉన్న ఆయన 200కు పైగా చిత్రాల్లో నటించారు. 

ఆయన చివరి చిత్రం అంబి నింగ్ వయస్సయతో చివరి చిత్రం. అది బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. కాంగ్రెసులో ఆయన రెబెల్ పొలిటిషియన్ గా పేరు పొందారు.

ఆయనకు భార్య సుమలత, కుమారుడు ఉన్నారు. సుమలత పలు తెలుగు సినిమాల్లో నటించారు.  అంబరీష్ అసలు పేరు మాలవల్లి హుచ్చే గౌడ్ అమర్నాథ్. ఆయన 1952 మే 29వ తేదీన జన్మించారు. ఆయన పోషించిన పాత్రలకు గాను రెబెల్ స్టార్ గా పేరు పొందారు.  ఆయన మాండ్యా మనిషి అనే ముద్దు పేరు ఉంది. 

మాండ్యా నియోజకవర్గం నుంచి కాంగ్రెసు తరఫున పోటీ చేసి శాసనసభకు గెలిచారు. సిద్దరామయ్య ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ధార్వాడ్ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఆయన 1972వలో కన్నడ సినీ రంగంలోకి ప్రవేశించారు. ఆయన తొలి సినిమా నాగరహావు.  ఈ సినిమా జాతీయ అవార్డును సాధించింది.

అంబరీష్ మృతికి పార్లమెంటు సభ్యుడు రాజీవ్ చంద్రశేఖర్ సంతాపం ప్రకటించారు.