కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ కు టాలీవుడ్ ఘననివాళులర్పిస్తోంది. సీనియర్ నటులు ఒక్కొక్కరిగా అంబరీష్ పార్థివదేహంను చివరి సారి చూసేందుకు బెంగళూరుకు వెళుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి - మోహన్ బాబు అక్కడికి చేరుకున్నారు. కంఠీరవా మైదానంలో అభిమానుల సందర్శనార్ధం ఉంచిన అంబరీష్ పార్థివదేహానికి వారు నిలవాళులర్పించారు. 

 

మొదట ఆయన పార్థివదేహాన్ని చూసి చిరంజీవి చలనచిపోయారు. కంటతడితో కుటుంబ సభ్యులను దగ్గరకు తీసుకొని ఓదార్చారు. మెగాస్టార్ తో అంబరీష్ శ్రీ మంజునాథ సినిమాలో రాజు పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే అంతకుముందు నుంచే వీరికి మంచి సన్నహిత్యం ఉంది. ఇక మోహన్ బాబు అంబరీష్ మృతదేహాన్ని చూసి గట్టిగా ఏడ్చేశారు.కొన్ని నిమిషాల వరకు ఆయన దుఃఖంలోనే కనిపించారు.  

రజినీకాంత్ కూడా కుటుంబ సభ్యులను ఓదార్చారు. కన్నడ రాజకీయ నాయకులు సీఎం కుమారస్వామి అలాగే పలువురు సినీ ప్రముఖులు కంఠీరవ మైదానంకు చేరుకుంటున్నారు.