Asianet News TeluguAsianet News Telugu

క్రేజీ హీరోతో అమలాపాల్ లిప్ లాక్, న్యూడ్ గా నటించేందుకు కూడా ఓకె అంటూ బోల్డ్ కామెంట్స్

ప్రస్తుతం అమలాపాల్ క్రేజీ హీరో పృథ్వీరాజ్ సుకుమార్ నటిస్తున్న  'ఆడుజీవితం' అనే చిత్రంలో నటిస్తోంది. నేషనల్ అవార్డు విజేత బ్లేస్సి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

Amala Paul interesting comments on lip lock with Prithviraj Sukumaran dtr
Author
First Published Apr 26, 2023, 8:40 PM IST

అదిరిపోయే అందంతో ఆకట్టుకునే అమలాపాల్ ప్రస్తుతం కెరీర్ ని వైవిధ్యంగా కొనసాగిస్తోంది. గ్లామర్ రోల్స్ పక్కన పెట్టి బలమైన కథలకు ప్రాధాన్యత ఇస్తోంది.  గతంలో కంటే ప్రస్తుతం అమలాపాల్ క్రేజ్ పెరిగింది. అందుకు కారణం ఆమె వైవిధ్యమైన కథలు ఎంచుకోవడమే. బోల్డ్ గా నటిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 

పాత్ర నచ్చితే న్యూడ్ గా నటించేందుకు కూడా ఆమె వెనుకాడడం లేదు. ఆడై చిత్రంలో అమలాపాల్ న్యూడ్ గా కొన్ని సన్నివేశాల్లో కనిపించింది. తెలుగులో 'ఆమె' పేరుతో ఆ చిత్రం విడుదలయింది. ఈ మూవీలో ఆమె న్యూడ్ గా నటించడంపై కొందరు అభినందిస్తే మరికొందరు విమర్శించారు.  

ప్రస్తుతం అమలాపాల్ క్రేజీ హీరో పృథ్వీరాజ్ సుకుమార్ నటిస్తున్న  'ఆడుజీవితం' అనే చిత్రంలో నటిస్తోంది. నేషనల్ అవార్డు విజేత బ్లేస్సి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ది గోట్ లైఫ్ పేరుతో ఈ చిత్రాన్ని ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ కోసం చిత్ర యూనిట్ గత పదేళ్లుగా శ్రమిస్తోంది అంటే అర్థం చేసుకోవచ్చు. ఎడారిలో వలస జీవుల ఆకలి వేదన, బానిస బతుకు నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 

ఇటీవల ఈ చిత్రం మొదటి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో పృథ్వీరాజ్, అమలాపాల్ మధ్య ఘాటైన లిప్ లాక్ సన్నివేశం ఉంది. దీనితో అమలాపాల్ బోల్డ్ సన్నివేశాల జోరు ఇప్పట్లో ఆగేలా లేదు అంటూ కామెంట్స్ వినిపించాయి. తాజాగా అమలాపాల్ ఈ లిప్ లాక్ సన్నివేశంపై ఓపెన్ అయింది. 

ఈ చిత్రానికి నేను సైన్ చేసే ముందే దర్శకుడు ఇలాంటి లిప్ లాక్ ఉంటుందని చెప్పారు. ముందుగానే ఆ సీన్ కి నేను ఓకె చెప్పా. ఆ సన్నివేశం పండాలంటే తప్పనిసరిగా లిప్ లాక్ ఉండాలి. అందుకే చేశా. అంతే కాదు కథ డిమాండ్ చేస్తే న్యూడ్ గా నటించేందుకు కూడా నేను సిద్దమే. ఈ విషయం ఇదివరకే చెప్పా. న్యూడ్ గా నటించేందుకే రెడీ అయిన నాకు లిప్ లాక్ సన్నివేశం అంత ఇబ్బందిగా అనిపించలేదు అని పేర్కొంది. అమలాపాల్ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios