ప్రేమ, పెళ్లి అంటూ వార్తల్లో నిలిచే అమలపాల్ పెళ్లి చేసుకొని విడాకులు తీసుకొని తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. తన అత్తమామలపై విమర్శలు చేసి సంచలనంగా మారింది. తాజాగా ఆమె తనకి అవకాశాలు ఇస్తోన్న తమిళ ఇండస్ట్రీనే తక్కువ చేసి మాట్లాడింది. 

కోలీవుడ్ ఒక ఫేక్ ఇండస్ట్రీ అని ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్ గా మారాయి. గతేడాది విడుదలైన 'తిరుట్టు పయలే2' సినిమా ఆశించిన స్థాయిలో ఆడని కారణంగా ఆమె ఈ విధమైన వ్యాఖ్యలు చేసింది.

కొన్నేళ్ల క్రితం వచ్చిన 'తిరుట్టు పయలే' చిత్రానికి సీక్వెల్ గా 'తిరుట్టు పయలే2' సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో బాబీ సింహా హీరోగా నటించగా.. అతడి భార్యగా అమలాపాల్ నటించింది. థ్రిల్లర్ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఏవరేజ్ టాక్ సొంతం చేసుకుంది.

అయితే ఒక పెద్ద హీరో నటించి, కమర్షియల్ అంశాలు ఉంటే గనుక ఈ సినిమా పెద్ద హిట్ అయ్యేదని వెల్లడించింది అమలాపాల్. బాలీవుడ్ లో ఇలా స్థాయి, కమర్షియల్ ఎలిమినేట్ కాకుండా.. కంటెంట్ చూసి సినిమాను హిట్ చేస్తారని.. తమిళంలో అలా కాదని అందుకే ఇదొక ఫేక్ ఇండస్ట్రీ అంటూ ఆమె చేసి వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. కోలీవుడ్ లో ఈ పరిస్థితులు మారి కంటెంట్ కి విలువిచ్చే పరిస్థితి రావాలని తన అభిప్రాయాన్ని వెల్లడించింది. 

ఇవి కూడా చదవండి.. 

డైరెక్టర్ ని హగ్ చేసుకుందామని వెళ్తే.. నటి అమలాపాల్ కామెంట్స్!

రాజకీయాల్లోకి మరో హీరోయిన్!

అలాంటి అమ్మాయిలు దేనికీ పనిరారు: అమలాపాల్