అలాంటి అమ్మాయిలు దేనికీ పనిరారు: అమలాపాల్

First Published 20, Jul 2018, 1:11 PM IST
amala paul on casting couch
Highlights

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీను పట్టిపీడిస్తోన్న విషయం 'కాస్టింగ్ కౌచ్'. భాషతో సంబంధం లేకుండా.. అన్ని సినీపరిశ్రమలను ఈ కాస్టింగ్ కౌచ్ కుదిపేస్తోంది.

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీను పట్టిపీడిస్తోన్న విషయం 'కాస్టింగ్ కౌచ్'. భాషతో సంబంధం లేకుండా.. అన్ని సినీపరిశ్రమలను ఈ కాస్టింగ్ కౌచ్ కుదిపేస్తోంది. అయితే ఎన్నడూలేని విధంగా ఇప్పుడు ఇండస్ట్రీలో తారలు ఈ విషయంపై బహిరంగంగా కామెంట్స్ చేస్తున్నారు.

కాస్టింగ్ కౌచ్ బాధితులం అంటూ కొందరు తారలు మీడియా ముందుకు వచ్చారు. దాదాపు అందరూ కూడా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని అంగీకరిస్తున్నారు. తాజాగా నటి అమలాపాల్ కూడా ఈ విషయంపై స్పందించింది. 'మానసికంగా ధైర్యంలేని అమ్మాయిలు సినిమా రంగంలో మాత్రమే కాదు ఏ రంగంలో కూడా రాణించలేరు. జాబ్ చేసే కొందరు మహిళలకు కూడా ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి.

అయితే వాటితో పోలిస్తే సినిమా రంగంలో ఈ సమస్య కాస్త ఎక్కువగా ఉంటుంది. అయితే ధైర్యంగా ఉండడం, స్ట్రెయిట్ గా ఆన్సర్ చేయడం, ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్లి మన నిర్ణయం మీద నిలబడగలిగితే కచ్చితంగా వేధింపుల సమస్య నుండి బయటపడొచ్చు. మానసికంగా ధైర్యంగా లేని అమ్మాయిలు దేనికీ పనికిరారు'' అంటూ చెప్పుకొచ్చింది. 

loader