హగ్ చేసుకొని పలకరించుకునే పాశ్చాత్యసంస్కృతి ఇప్పుడు మనకి కూడా పాకింది. స్నేహితులు ఒకరినొకరు హగ్ చేసుకొని పలకరించుకోవడం సాధారణంగా మారిపోయింది. అదే కోణంలో హీరోయిన్ అమలాపాల్ తన దర్శకుడికి హగ్ ఇవ్వబోతుంటే ఆయన మాత్రం కంగారు పడి తప్పించుకున్నారని ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది.

అసలు విషయంలోకి వస్తే అమలాపాల్ దర్శకుడు రామ్ కుమార్ రూపొందించిన 'రాక్షసన్' సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత సంతోషంతో ఆమె దర్శకుడు రామ్ ని కౌగిలించుకోబోయిందట.
ఆ సమయంలో అతడు కంగారు పడి వెనక్కి వెళ్లారని సినిమా సక్సెస్ మీట్ లో అమలాపాల్ స్వయంగా వెల్లడించింది. రామ్ చాలా మంచి వ్యక్తి అంటూ ఉదాహరణ కోసం ఆ సందర్భాన్ని గుర్తుచేసుకుంది. రామ్ ఈ సినిమాకి ముందే పెళ్లి చేసుకోవాల్సిందని ఈ సినిమా తీసిన తరువాత ఆయనకి పిల్ల దొరకడం కష్టమేనంటూ చమత్కరించింది.