శాటిలైట్ హక్కుల రూపంలో సినిమాలు వసూళ్లపరంగా  అల్లు అర్జున్ సరికొత్త మార్క్ ను సెట్ చేశాడు. తన కెరీర్ లోనే హయ్యెస్ట్ శాటిలైట్, డిజిటల్ ఫిగర్స్ ని టచ్ చేశాడు. బన్నీ లేటెస్ట్ చిత్రం ‘నా పేరు సూర్య’ . వక్కంతం వంశీ దర్శకత్వం. ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ కలుపుకొని మొత్తంగా 24. 7కోట్లకు అమ్ముడుపోయాయి. అల్లు అర్జున్ కెరీర్ లోనే ఇది హయ్యెస్ట్ రేటు. ఈ సినిమా తెలుగు శాటిలైట్ హక్కులను 15 కోట్లను చెల్లించి జీ తెలుగు సొంతం చేసుకుంది. ఇక ఇతర భాషల శాటిలైట్ , డిజిటల్ రైట్స్ కలుపుకొని మొత్తం రూ 24. 7 కోట్ల భారీ మొత్తానికి వెళ్లినట్లు తెలిసింది.

 

ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్ సంచలనం సృష్టించింది. తొలి 24 గంటల్లోనే ఆన్‌లైన్‌లో కోటికిపైగా వ్యూస్‌ దక్కించుకుంది. ఈ సినిమాపై ఎంతటి క్రేజ్ ఉందో ఆ వ్యూస్ చెప్పకనే చెప్పాయి. ఇప్పుడు ఆ క్రేజ్ కు తగ్గట్టే ఈ సినిమాకు ఏకంగా రూ 24. 7కకోట్లు కేవలం శాటిలైట్, డిజిటల్ రూపంలో రావడం విశేషం. వక్కంతం వంశీ దర్శకుడి పరిచయం అవుతున్న తొలి సినిమాతోనే ఇలా శాటిలైట్ పరంగా రికార్డ్ సృష్టించడం మరో విశేషం.

 

ఇక రంగస్థలం, భరత్ అను నేను, కృష్ణార్జున యుద్ధం, భాగమతి సినిమాల శాటిలైట్ హక్కులను స్టార్ మా ఇంట్రెస్టింగ్ ప్రైస్ కు దక్కించుకుంది.