Asianet News TeluguAsianet News Telugu

‘అఖండ’ కొత్త రిలీజ్ డేట్ ఖరారు,ఈ వారంలో ప్రకటన

ఈ సినిమా దీపావళికి సందడి చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అందరూ భావించారు. మీడియాలో ప్రచారం కూడా జరిగింది. అయితే అదేమీ జరగటం లేదు. ఈ నేపధ్యంలో ప్రస్తుతం చిత్ర టీమ్ విడుదల తేదీ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. 

Akhanda Locks A New Release Date
Author
Hyderabad, First Published Nov 2, 2021, 9:20 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

బాలకృష్ణ  హీరోగా తెరకెక్కుతున్న ‘అఖండ’ రిలీజ్ డేట్ పై క్లారిటీ కోసం అభిమానులు చూస్తున్నారు. రకరకాల కారణాలతో రిలీజ్ డేట్ లేటు అవుతూ వస్తోంది. ఈ సినిమా దీపావళికి సందడి చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అందరూ భావించారు. మీడియాలో ప్రచారం కూడా జరిగింది. అయితే అదేమీ జరగటం లేదు. ఈ నేపధ్యంలో ప్రస్తుతం చిత్ర టీమ్ విడుదల తేదీ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 2 న విడుదల చేయాలని మేకర్స్ పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఓ వారంలోనే రిలీజ్ డేట్ పోస్టర్ తో అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉందంటున్నారు.అది దీపావళి రోజు అయ్యే అవకాసం ఉందంటున్నారు. అప్పటి నుంచి ప్రమోషన్స్  మొదలుపెట్టనున్నారు. 

ఇక  ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటున్నాయి.  నందమూరి బాలకృష్ణ, మాస్‌ డైరెక్టర్ బోయపాటి శ్రీ‌ను కాంబినేషన్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ’. సూపర్ హిట్టైన ‘సింహా’, ‘లెజెండ్‌’ తర్వాత బాలకృష్ణ - బోయపాటి శ్రీను కలయికలో రూపొందుతున్న చిత్రమిది. ఇందులో బాలకృష్ణ రెండు పాత్రల్లో సందడి చేస్తారు. ప్రగ్యా జైశ్వాల్‌, పూర్ణ హీరోయిన్స్. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాత. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ - గోపీచంద్‌ మలినేని కలయికలో ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనుంది. ఆ తర్వాత బాలకృష్ణ చేయనున్న చిత్రం ఖరారైన విషయం తెలిసిందే. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించనున్నారు.

 ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడు పోయాయని సమాచారం. అంతేకాదు ఈ అఖండ సినిమా బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ ఫిగర్స్ టచ్ చెయ్యనున్నట్టుగా తెలుస్తోంది.   ఈ సినిమా మొత్తం ఆంధ్ర హక్కులు రూ. 35 కోట్ల కు అమ్ముడయ్యాయి, నైజాం ప్రాంతం రూ. 10 కోట్లుకు అమ్మడు అయ్యాయని... సీడెడ్ రీజియన్ హక్కులు రూ .12 కోట్లకు అమ్ముడు పోయాయని చెప్తున్నారు.  

Also read ఒకే ఫ్రేమ్ లో బాలయ్య, ఎన్టీఆర్, సర్వం సిద్దం?

మరో ప్రక్క ఈ సినిమా డిజిటల్ శాటిలైట్ హక్కులను హాట్ స్టార్, స్టార్ దక్కించుకుందని ప్రచారం జరుగుతోంది. అఖండ షూటింగ్ పూర్తి అవ్వడంతో ఇక బాలయ్య మరో సినిమాను మొదలు పెట్టనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ద్వారక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

Also read Samantha: ప్రీతమ్ జుకల్కర్ గే... ఆ అనుమానాలు బలపరుస్తున్న సమంత లేటెస్ట్ పోస్ట్... అంతలోనే డిలీట్!
 

Follow Us:
Download App:
  • android
  • ios