Asianet News TeluguAsianet News Telugu

ఒకే ఫ్రేమ్ లో బాలయ్య, ఎన్టీఆర్, సర్వం సిద్దం?

ఎన్టీఆర్, బాలయ్య ఇద్దరూ ఒకే సినిమాలో కనిపించాలని..కలిసి నటించాలని. ఆ కోరిక ఇప్పట్లో తీరేలా కనపడటం లేదు.  అయితే ఈ స్టార్స్ ఇద్దరూ గతంలో స్టేజీని పంచుకున్నారు. ఇప్పుడు మరోసారి ఇద్దరూ ఒకే  ఫ్రేమ్ లో కనపడబోతున్నట్లు సమచారం.

Balakrishna and NTR coming together For AHA
Author
Hyderabad, First Published Nov 1, 2021, 8:59 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

నందమూరి అభిమానుల కోరిక ..ఎన్టీఆర్, బాలయ్య ఇద్దరూ ఒకే సినిమాలో కనిపించాలని..కలిసి నటించాలని. ఆ కోరిక ఇప్పట్లో తీరేలా కనపడటం లేదు.  అయితే ఈ స్టార్స్ ఇద్దరూ గతంలో స్టేజీని పంచుకున్నారు. ఇప్పుడు మరోసారి ఇద్దరూ ఒకే  ఫ్రేమ్ లో కనపడబోతున్నట్లు సమచారం. ఫ్యాన్స్ కోరికను గమనించిన ఆహా ఓటీటి వారు దాన్ని నిజం చేయబోతున్నారని తెలుస్తోంది. మీకు ఇప్పటికే అర్దమయ్యే ఉంటుంది. ఆహా లో బాలయ్య చేస్తున్న పోగ్రామ్ కు ఎన్టీఆర్ గెస్ట్ గా రాబోతున్నారని.

ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు అల్లు అరవింద్ ఆధ్వర్యంలో రన్ అవుతున్న ఆహా వీడియో వారు ఈ హీరోలు ఇద్దరినీ ఒకే వేదికపైకి రప్పించబోతున్నారట. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి అని తెలుస్తోంది.  గేమ్ షోస్.. టాక్ షోలతో ప్రేక్షకులను అలరిస్తూ.. ఇతర ఓటీటీ ప్లాట్‏ఫాంలకు ఆహా గట్టిపోటీనిస్తుంది. గతంలో సమంతతో సామ్ జామ్ అనే టాక్ షో చేసిన ఆహా ఈసారి ఏకంగా నందమూరి నటసింహం బాలకృష్ణతో ఆహా సంచలనం సృష్టించేందుకు రెడీ అయ్యింది. బాలయ్య హోస్ట్‏గా ఈ  టాక్ షోను ఆహా నిర్వహిస్తోంది. ఈ షో నవంబర్ 4 నుంచి ప్రసారం కానుంది. అయితే బాలయ్య షోకు మొదటి ఎపిసోడ్‏లో అతిథులుగా ఎవరు రాబోతున్నారు… బాలకృష్ణ ఎవరిని ప్రశ్నించబోతున్నారనేదానిపై క్లారిటీ ఇస్తూ ఓ ప్రోమో కూడా వచ్చేసింది.

ఈ నేపధ్యంలో ఎన్టీఆర్ ని ఈ షోకు ఆహ్వానించారట. బాలయ్య, ఎన్టీఆర్ ల మధ్య జరిగే సంభాషణలు ఖచ్చితంగా ఆసక్తి కలిగిస్తాయనటంలో సందేహం లేదు. ఇక ఈ షోలో నాని, రానా, ప్రభాస్ వంటి గెస్ట్ లు రాబోతున్నారట. అలాగే సమంత, కాజల్, పూజ హెగ్డే ,రష్మక వంటి హీరోయిన్స్ కూడా ఈ షో లో కనపడబోతున్నారట. 

Also read Balakrishna: తండ్రి స్థాపించిన పార్టీ చంద్రబాబు చేతిలో ఎందుకు పెట్టావ్... బాలయ్య సమాధానం
ఇక దీపావళి రోజు స్ట్రీమింగ్ అయ్యే షోకు  డైలాగ్ కింగ్ ఫ్యామిలీ మోహన్ బాబు.. మంచు లక్ష్మి, మంచు విష్ణులను బాలకృష్ణ ఇంటర్య్వూ చేసినట్లుగా కన్ఫార్మ్ చేశారు. ఇందుకు సంబంధించిన పోస్టర్స్‏ను నెట్టింట్లో షేర్ చేసి అసలు విషయాన్ని రివీల్ చేశారు మేకర్స్. ఇక ఇందుకు సంబంధించిన ప్రోమోను సైతం విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు. ఇప్పటివరకు వెండితెరపై తనదైన సత్తా చూపించిన బాలయ్య.. బుల్లితెరరపై ఎలాంటి సందడి చేయనున్నారో అని అభిమానులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ షో నవంబర్ 4వ తేదీ నుంచి ప్రసారం కానుంది. మొత్తం 12 ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ కానున్నాయి.  

Also read Bigg boss telugu5: హౌస్ నుండి లోబో అవుట్..!
 

Follow Us:
Download App:
  • android
  • ios