ఓ పక్క కాస్టింగ్ కౌచ్ టాలీవుడ్ ను కుదిపేస్తుంటే.. ఇప్పుడు అమెరికాలో టాలీవుడ్ తారల సెక్స్ రాకెట్ వెలుగులోకి వచ్చి పెనుదుమారం రేపుతోంది. కిషన్ దంపతుల అరెస్ట్ తో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై ఇప్పటికే పలువురు స్పందించారు. తమకు కూడా ఇలాంటి చేదు అనుభవాలు ఎదురైనట్లు వెల్లడించారు. తాజాగా నటి సంజన కూడా ఈ విషయంపై కామెంట్ చేసింది.

 ''అమెరికాలో ఈవెంట్స్ పేరిట తారలను సంప్రదించడం చాలా కామన్. అమెరికాకు సినిమా వాళ్లు వెళ్లడం ఎప్పటినుండో జరుగుతుంది. అయితే టాలీవుడ్ లో ఉండే సీ, డీ గ్రేడ్ ఆర్టిస్టులను కొందరు నిర్వాహకులు కావాలని అమెరికాకు తీసుకువెళ్లి వారిని వ్యభిచార కూపంలోకి లాగుతుంటారు. ఈవెంట్ లో డాన్స్ లు, స్కిట్ లి వేయాలని ఆహ్వానించి అక్కడకి వెళ్లిన తరువాత పెద్ద మొత్తం డబ్బు ఆశ చూపించి బలవంతంగా వ్యభిచారం చేయిస్తుంటారు. అయితే ఇక్కడ మరో విషయం కూడా ఉంది. కొందరు తారలు డబ్బు కోసం తమ అంగీకారంతోనే ఇలాంటి పనులు చేయడానికి అంగీకరిస్తారని'' షాకింగ్ కామెంట్స్ చేసింది.