బాలీవుడ్ ముద్దుగుమ్మ కంగనా తన ఘాటు వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటుంది. ఇప్పటికే చాలా మంది దర్శకులు, నిర్మాతలు, నటీనటులపై కామెంట్స్ చేసింది. కంగనా పేరు ఎన్ని వివాదాల్లో వినిపించినప్పటికీఆమె అభిమానుల సంఖ్య మాత్రం తగ్గలేదు. తాజాగా ఈ బ్యూటీ ఢిల్లీలో నిర్వహించిన మైండ్ రాక్స్ అనే ఈవెంట్ లో పాల్గొంది. ఈ ఈవెంట్‌లో ఆమె సెక్స్ గురించి బోల్డ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది.

ప్రతి ఒక్కరి జీవితంలో సెక్స్ అనేది ఇంపార్టెంట్ విషయమని.. సెక్స్ చేయాలనిపిస్తే చేసేయాలని అన్నారు. ఒక వ్యక్తిని చూపించి పెళ్లి చేసుకోమని తల్లి తండ్రులు చూపించినప్పుడు మనకి కూడా ఇష్టం ఉంటే ఆ వ్యక్తి పట్ల ఫీలింగ్ పెంచుకుంటామని అన్నారు.

తను సెక్స్ విషయంలో చాలా యాక్టివ్ గా ఉంటానని తెలిసినప్పుడు తన తల్లితండ్రులు షాక్ అయ్యారని.. కానీ అంత అవసరం లేదని.. పిల్లలకు సెక్స్ విషయంలో నాలెడ్జ్ ఉన్నందుకు వారు సంతోషించాలని.. సెక్స్ ని ఓ బాధ్యతగా ఫీలవ్వాలని.. సెక్స్ లో పాల్గొనమని తల్లితండ్రులే వారిని ప్రోత్సహించేలా ఉండాలని చెప్పారు. తన తొలి ముద్దు, రిలేషన్షిప్ గురించి కొన్ని కామెంట్స్ చేసింది ఈ బ్యూటీ.

17 ఏళ్ల వయసు ఉన్నప్పుడేఒక పంజాబీ అబ్బాయిని ఇష్టపడ్డానని.. అతను చాలా అందంగా ఉండేవాడని అతడి వయసు 28 కావడంతో తనను చిన్నపిల్ల అన్నాడని.. ఆ సమయంలో తన గుండె ఆగిపోయినంత పనైందని.. కానీ ఎలాగోనా తన ప్రేమ విషయాన్ని ఆయనకి చెప్పి కొంతకాలం రిలేషన్ లో ఉన్నామని.. కానీ ఆ తరువాత విడిపోయామని చెప్పుకొచ్చింది. ఇక తన తొలి ముద్దు గురించి మాట్లాడుతూ.. '' నాకు ముద్దు పెట్టడం అసలు వచ్చేది కాదు. నా చేతిమీద ముద్దు పెట్టుకుంటూ ఉండేదాన్ని. అలా నేను ముద్దు 
పెట్టడం నేర్చుకున్నా. తొలిసారి ఓ వ్యక్తిని ముద్దుపెట్టేటప్పుడు చాలా టెన్షన్ పడ్డాను'' అంటూ చెప్పుకొచ్చింది.