29ఏళ్ల హాట్ బ్యూటీ నియా శర్మ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తనపై దురుసుగా ప్రవర్తించిన నెటిజన్ కు తగిన విధంగా బుద్ది చెప్పింది. నియా శర్మ బుల్లితెరపై తిరుగులేని స్టార్. ఇక సోషల్ మీడియాలో కూడా ఆమెని మిలియన్ల కొద్దీ ఫ్యాన్స్ ఫాలో అవుతారు. 

బుల్లి తెర నటి అయిన నియా శర్మ స్టార్ హీరోయిన్ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుందంటే అందుకు కారణం ఆమె అందమే. ఆ మధ్య నిర్వహించిన ఓ సర్వేలో ఆసియాలోని అందమైన సెలెబ్రిటీలలో నియా శర్మ ఒకరిగా స్థానం సంపాదించింది. 

దీనిపై ఓ నెటిజన్ దురుసుగా వ్యాఖ్యలు చేశాడు. నియా శర్మ ఏదో విధంగా వార్తల్లో నిలుస్తూ సెలెబ్రిటీగా మారిపోయింది. భూమి మీద సెలెబ్రిటీ అని పిలవబడుతూ అందవికారంగా ఉన్న వారిలో నియా శర్మ ఒకరు. ఆమె తన పీఆర్ టీం ద్వారా పబ్లిసిటీ చేయించుకుంటూ ఇంతటి క్రేజ్ సంపాదించిందని కామెంట్ చేశాడు. 

తనపై అక్కసు వెళ్లగక్కిన సదరు నెటిజన్ కు అంతే ఘాటుగా నియా కౌటర్ ఇచ్చింది. నీకు కనీసం సిగ్గు కూడా లేదు.. ఒక విషయం గుర్తుంచుకో నాకు ఇంతవరకు పీఆర్ టీం లేదు. నేనెప్పుడూ సహజంగానే ఉంటా అని నియా శర్మ సమాధానం ఇచ్చింది. 

నియా శర్మకు ఆమె అభిమానులతో పాటు కొందరు సెలెబ్రిటీలు కూడా మద్దతు తెలుపుతున్నారు. నియా శర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లో తరచుగా హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటోంది.