బాలీవుడ్ కేంద్రంగా నడుస్తున్న డ్రగ్స్ వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ మారింది. సుశాంత్ డెత్ కేసుగా మొదలైన విచారణ డ్రగ్స్ కేసుగా మలుపుతిరిగింది. రియా చక్రవర్తి, సుశాంత్ లతో కలిసి కొందరు రోజూ డ్రగ్స్ తీసుకొనేవారని ఆ ఇంటిలో పనిచేసిన వారు సీబీఐ విచారణలో చెప్పడం జరిగింది. దీనితో సుశాంత్ డెత్ కేసును డ్రగ్స్ కోణంలో అధికారులు విచారించడం మొదలుపెట్టారు.  సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి, ఆమె తమ్ముడు షోవిక్ చక్రవర్తి కి డ్రగ్ పెడ్లర్స్ తో సంబంధాలు ఉన్నట్లు ఆధారాలను వెలికితీశారు. 

రియా, షోవిక్ లతో పాటు మరో 15మంది ఈ కేసులో అరెస్ట్ కాబడ్డారు. విదేశాల నుండి బాలీవుడ్ కి డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని, బాలీవుడ్ డ్రగ్ మాఫియాకు అడ్డాగా మారిందని నటుడు మరియు ఎంపీ రవి కిషన్ పార్లమెంట్ లో ధ్వజమెత్తారు. ఈ మాఫియా వెనకున్న ప్రతిఒక్కరిని కనుగొని శిక్షించాలని ఆయన ప్రభుతాని కోరారు. ఈ వ్యాఖ్యలకు అమితాబ్ సతీమణి జయాబచ్చన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కొందరు కారణంగా బాలీవుడ్ మొత్తంపై డ్రగ్స్ ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. 

జయాబచ్చన్ కి బాలీవుడ్ నుండి మద్దతు లభించింది. తాజాగా ఈ విషయంపై సీనియర్ హీరోయిన్ హేమమాలిని స్పందించారు. బాలీవుడ్ పై డ్రగ్స్ ఆరోపణలు తీవ్రంగా కలచివేశాయి. బాలీవుడ్ లో అందరూ డ్రగ్స్ వాడుతున్నారంటూ చెడ్డగా మాట్లాడడం ఇబ్బంది కలిగిస్తుంది. నిజానికి బాలీవుడ్ లో ప్రచారం జరుగుతున్నంత తీవ్ర స్థాయిలో డ్రగ్స్ వాడకం లేదని అన్నారు. అలాగే నిరాధారమైన ఆరోపనలు చేస్తున్నవారిపై ఆమె కోపం వ్యక్తం చేశారు.