నటుడు సోనూసూద్ మరోమారు తన ఉదారత చాటుకున్నారు.  ఓ బాలుడు వైద్య ఖర్చుల నిమిత్తం ఏకంగా 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. తెలంగాణా రాష్ట్రంలోని డోర్నకల్ మండలం, పెరుమాండ్ల గ్రామానికి చెందిన హర్షవర్ధన్ అనే బాలుడు లివర్ సంబంధింత వ్యాధికి గురయ్యారు. వైద్యులు అతనికి ఆపరేషన్ చేయాలని, లక్షల్లో ఖర్చు అవుతుందని చెప్పడం జరిగింది. అంత ఆర్థిక స్థోమత లేని ఆ పిల్లవాడి తల్లి తండ్రులు సాయం కోసం ఎదురుచూస్తుండగా, కొందరు సోనూసూద్ కలవాలని సూచించడం జరిగింది. 

నటుడు సోనూసూద్ ని హర్షవర్ధన్ తల్లితండ్రులు తన కుమారుడిని కాపాడాలని అభ్యర్దించగా,ఆయన స్పందించారు. హర్షవర్ధన్ లివర్ ఆపరేషన్ కోసం అయ్యే ఖర్చు భరిస్తానని, అతనికి వైద్యం చేయిస్తానని సోనూ సూద్ హామీ ఇచ్చారు. దీనితో హర్షవర్ధన్ తల్లితండ్రులు సోనూసూద్ కి ధన్యవాదాలు తెలిపారు. 

ఇప్పటికే వేలమంది వలస కార్మికులను తమ నివాస స్థానాలకు చేర్చిన వాళ్ళ పాలిట దేవుడైన సోనూ సూద్, దేశంలోని అనేక మంది అభ్యర్ధనలకు స్పందించారు. అడిగించే తడవుగా అనేక మంది అవసరాలు, ఇబ్బందులు సోనూ సూద్ తీర్చడం జరిగింది సోనూసూద్ సేవా గుణాన్ని దేశవ్యాప్తంగా పొగుడుతున్నారు. ఇటీవల అల్లుడు అదుర్స్ షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన సోనూ సూద్ కి హైదరాబాద్ వాసుల నుండి ఘన స్వాగతం లభించింది. అల్లుడు అదుర్స్ సెట్ లో ప్రకాష్ రాజ్, సోనూసూద్ ని సత్కరించారు.