Asianet News TeluguAsianet News Telugu

‘స్వాతిముత్యం’ నుంచి అందమైన ప్రేమ గీతం.. ‘నీ చారెడు కళ్లే’ మెలోడీకి మంచి రెస్పాన్స్..

యంగ్ స్టార్స్ గణేష్ బెల్లంకొండ, వర్ష బొల్లమ్మ హీరోహీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ ఫిల్మ్ ‘స్వాతి ముత్యం’. ఈ చిత్రం నుంచి తాజాగా యూనిట్ ప్రేమ గీతాన్ని విడుదల చేసింది. ప్రస్తుతం ఆ సాంగ్ యూట్యూబ్ లో దూసుకెళ్తోంది.

A Wonderful Melody song form Swathi Muthyam film
Author
Hyderabad, First Published Jun 27, 2022, 5:35 PM IST

థియేటర్ల వద్ద ప్రస్తుతం భారీ చిత్రాల ఫ్లో తగ్గడంతో చిన్న సినిమాలు  సందడి మొదలైంది. ఇప్పటికే వరుస డేట్లు అనౌన్స్ చేస్తూ రిలీజ్ లకు సిద్ధం అవుతున్నాయి. అందులో భాగంగా ప్రచార కార్యక్రమాలనూ జోరుగా నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా రూపుదిద్దుకున్న రొమాంటిక్ డ్రామా ఫిల్మ్ ‘స్వాతి ముత్యం’ (Swathi Muthyam). ఈ చిత్రానికి లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వం వహించారు. యంగ్ స్టార్స్ గణేష్ బెల్లంకొండ, వర్ష బొల్లమ్మ హీరో హీరోయిన్లుగా నటించారు. మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చగా, సూర్య తేజ ముసునూరు సినిమాటోగ్రఫీ గా వర్క్ చేశారు. ప్రముఖ ఎడిటర్ నవీన్ నూలి అద్భుతమైన వర్క్ అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రం రిలీజ్ కు సిద్ధమైంది. ఆగస్టు 13న ‘స్వాతి ముత్యం’ను గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ షెడ్యూల్ చేశారు. ఈ సందర్భంగా ప్రచారం కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ‘స్వాతి ముత్యం’ చిత్రం నుంచి ‘నీ చారెడు కళ్లు’ అనే అద్భుతమైన ప్రేమ గీతాన్ని తాజాగా విడుదల చేశారు.  "నీ చారెడు కళ్లే చదివేస్తూ ఉన్నా...నీ మత్తులో మళ్లీ పడిలేస్తూ ఉన్నా" అంటూ సాగే లిరిక్స్ వినసొంపుగా ఉన్నాయి. పట్టణ నేపథ్యంలో చిత్రీకరించిన ఈ గీతానికి సాహిత్యాన్ని కె కె అందించగా, అర్మాన్ మాలిక్, సంజన కల్ మంజే శ్రావ్యంగా ఆలపించారు. మహతి స్వర సాగర్ సంగీతంలో కొత్త హొయలు పోయిందీ గీతం.  గణేష్ మాస్టర్ నిర్దేశకత్వంలో రూపొందిన ఈ పాట ప్రేక్షకులను అలరిస్తుంది.

ప్రేమ తాలూకు భావోద్వేగాలు ఎప్పుడూ కొత్తగానే ఉంటాయి. ఓ అమ్మాయి కి , ఓ అబ్బాయి కి మధ్య పరిచయం, అది ప్రేమ వైపు సాగే ప్రయాణం, దాని తాలూకు అనుభూతులు, జరిగే సంఘటనలు, వాటి సందర్భాలు ... ఇవన్నీ ఎంత కొత్తగా వుంటే అంతగా మనసును హత్తుకుంటాయి. ఇప్పుడు విడుదలైన ‘స్వాతిముత్యం’ లోని గీతం కూడా అలానే అనిపిస్తుంది, ఆకట్టుకుంటుంది. యూట్యూబ్ లోనూ ఈ లవ్ ట్రాక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios