2017 బాహుబలి 2 రిలీజ్ టైమ్ లో ఎవరు ఊహించని విధంగా రెండు వారాల గ్యాప్ లో విడుదలైన చిత్రం కేశవ. గట్టి పోటీ ఉన్నప్పటికీ ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా బాహుబలి బజ్ లోనే ప్రమోషన్స్ చేశారు. దాంతో కేశవ సినిమా జనాలకు బాగానే కనెక్ట్ అయ్యింది. రివెంజ్ డ్రామా గా తెరకెక్కిన ఆ సినిమా హీరో నిఖిల్ కెరీర్ కి కూడా మంచి బూస్ట్ ఇచ్చింది.

బాహుబలి లాంటి సినిమా కలెక్షన్స్ తో దూసుకుపోతున్నప్పటికీ కేశవ కూడా మంచి లాభాలను అందించింది.  అయితే మరోసారి ఆ సినిమా దర్శకుడు నిర్మాత కలిసి మరో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ కాన్సప్ట్ తో రాబోతున్నారు. కేశవ దర్శకుడు సుధీర్ వర్మ మొదటి సినిమా స్వామి రారా తోనే తానేంటో నిరూపించుకున్నాడు. ఇక ఇటీవల వచ్చిన రణరంగం సినిమా మాత్రం అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది.

దీంతో ఎలాగైనా నెక్స్ట్ సినిమాతో మంచి సక్సెస్ అందుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.  ప్రస్తుతం సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే సినిమాలో కథానాయకుడు ఎవరనేది ఇంకా ఫైనల్ చేయలేదు. మొదట నిఖిల్ అని అనుకున్నప్పటికీ నిర్మాత అభిషేక్ ఆలోచన మేరకు దర్శకుడు మరో హీరోను సంప్రదిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ కాంబినేషన్ పై స్పెషల్ ఎనౌన్స్మెంట్ వెలువడనుంది.