విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ వచ్చిన  `పెళ్లిచూపులు`తో  తరుణ్‌భాస్క‌ర్ పేరు ఒక్కసారిగా మారు మ్రోగిపోయింది. ఈ సినిమాతో తరుణ్ కు అభిమానులు సైతం ఏర్పడ్డారు. ద‌ర్శ‌కుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపుని సొంతం చేసుకున్నారు. ఇండిపెండెంట్ ఫిల్మ్ మేక‌ర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్క‌ర్ ఆ త‌రువాత `ఈ న‌గ‌రానికి ఏమైంది?` చిత్రాన్ని రూపొందించారు. ఆ  సినిమా బాక్సాఫీస్ డిజాస్టర్ అయ్యింది. దాంతో ద‌ర్శ‌కుడిగా గ్యాప్ తీసుకుని నటుడుగా సినిమా చేసాడు.

`మీకు మాత్ర‌మే చెప్తా` అంటూ తన నటనతో  ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. విజ‌య్ దేవ‌ర‌కొండ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన ఈ చిత్రం ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌లేక‌పోయింది. ఈ నేపధ్యంలో త‌రుణ్ భాస్క‌ర్ వాట్ నెక్ట్స్ అనే ప్ర‌శ్న‌లు మొద‌ల‌ైంది. మరో ప్రక్క తరుణ్ అతి త్వ‌ర‌లో భారీ చిత్రాన్ని చేయ‌బోతున్నాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. అందులో వెంక‌టేష్ హీరోగా న‌టించే అవ‌కాశం వుంద‌ని వార్త‌లు వినిపించాయి.

ఈ న్యూస్ ని ఖరారు చేస్తూ....త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వెంక‌టేష్ హీరోగా సినిమా వుంటుంద‌ని డి. సురేష్‌బాబు ఆ మ‌ధ్య మీడియాతో చెప్పారు కూడా కానీ దానికి సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ ఆగిపోయాయి.  త‌రుణ్ న‌టుడిగా ఇంకో సినిమా చేసారు. అంతేకాదు వెబ్ సీరిస్ లు ప్రొడ్యూస్ చేస్తున్నాడని అన్నారు.

 కానీ ఎవరూ ఊహించని విధంగా అనూహ్యంగా ఆయ‌న ఓ ప్ర‌ముఖ టీవీ ఛాన‌ల్ కోసం ఓ షో చేస్తున్న‌ట్టు వార్త వచ్చింది. `నీకు మాత్ర‌మే చెప్తా` పేరుతో ఈ షోని డిజైన్ చేసారు. ఈ మేరకు అధికారక ప్రకటన వచ్చింది. మొత్తం 25 ఎపిసోడ్‌లు ఈ షో వుంటుంద‌ని, త్వ‌ర‌లోనే ఇది ప్రారంభం అవుతుంద‌ని త‌రుణ్‌భాస్క‌ర్ ఇన్‌స్టా గ్రామ్ ద్వారా  వెల్ల‌డించారు.