గత ఏడాది నవంబర్ లో హైదరాబాద్ లో జరిగిన దిశా అత్యాచారం, మర్డర్ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రేపిస్టులు దిశాని దారుణంగా సజీవ దహనం చేయడంతో దేశం మొత్తం ప్రజలంతా విచారంతో పాటు ఆగ్రహావేశాలతో రగిలిపోయారు. రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు, సెలెబ్రిటీలు ఈ దారుణాన్ని తీవ్రంగా ఖండించారు. 

నిందితులని తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. తమపై దాడి చేసి తప్పించుకు పారిపోవడానికి ప్రయత్నించిన నిందితులని కాల్చి చంపామని పోలీసులు తెలిపారు. ఎక్కడ వివాదం ఉన్న రాంగోపాల్ వర్మ అక్కడ వాలిపోతుంటారు. ఇటీవల వర్మ దిశా సంఘటనపై తాను సినిమా తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 

ఆర్జీవీ న్యూ ఫిల్మ్ 'దిశా'.. భయపెట్టే సినిమా తీస్తాడట!

ఈ ప్రకటన చేయగానే వర్మ తన పని మొదలు పెట్టేసినట్లు ఉన్నాడు. ఇందులో భాగంగా వర్మ తాజాగా నిందితులలో ఒకరైన చెన్నకేశవులు భార్యని వర్మ కలిశాడు. వర్మ తన ఆఫీస్ లో రేణుకతో మాట్లాడారు. ఈ విషయాన్ని వర్మ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. 

'రేపిస్ట్ చెన్నకేశవులు భార్యని ఇప్పుడే కలిశాను. ఆమె చెన్నకేశవులుని 16 ఏళ్ల టీన్ ఏజ్ లోనే వివాహం చేసుకుంది. ఇప్పుడు ఆమెకు 17 ఏళ్ళు.. త్వరలో తల్లి కాబోతోంది. అతడు కేవలం దిశ జీవితన్నే కాదు.. తన భార్య జీవితాన్ని కూడా నాశనం చేశాడు. ప్రస్తుతం రేణుక, ఆమెకు పుట్టబోయే బిడ్డ జీవితం అంధకారంలో ఉంది ' అంటూ వర్మ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. 

ధనుష్ వల్లే అమలాపాల్ విడాకులు.. పెళ్లి తర్వాత జరిగింది ఇదే, సంచలన కామెంట్స్!

దిశా సంఘటనపై తన తెరకెక్కించే చిత్రం అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి భయంకరమైన గుణపాఠంగా ఉండబోతోందని వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

హీరోలకే మైండ్ బ్లాక్.. మాస్ స్టెప్పులతో టాప్ లేపేసిన హీరోయిన్లు

బాబోయ్.. నిర్మాతల ఆస్తులు స్వాహా చేస్తున్న నయనతార!