విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గత రెండు రోజులుగా నిర్భయ కేసుపై నిరంతర ట్వీట్స్ తో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాడు. ఓ బాధిత మహిళకు న్యాయం చేయలేని సిస్టమ్ ఎందుకని ఎప్ప్పుడు లేని విధంగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. అయితే ఫైనల్ గా తన తదుపరి సినిమాపై కూడా ఆర్జీవీ క్లారికి ఇచ్చాడు. తన సినిమాకు సంబందించిన మెయిన్ కాన్సెప్ట్ పై వర్మ చేసిన ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.

మునుపటి రేపిస్టుల తప్పుల నుండి నేటితరం రేపిస్టులు చాలా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, కాని వారు అత్యాచారాలను ఆపడం లేదని అయితే నేను తీయబోయె చిత్రం 'దిషా' మనందరికీ భయం కలిగించే ఒక గుణపాఠంగా నిలుస్తుందని కామెంట్ చేశారు. ఇక నిర్భయ కేసు విషయంలో శిక్ష నుంచి తప్పించుకుంటూ నిందితుల తరపు న్యాయవాది న్యాయస్థానంలో ఫుట్ బాల్ లాగా ఆడుకుంటున్నారని అన్నారు.

దిశ ఘటనకు సంబందించిన పోటోలను సైతం పోస్ట్ చేసిన వర్మ ఈ సినిమాని త్వరలోనే మొదలుపెట్టనున్నట్లు చెబుతున్నాడు. ఇకపోతే వర్మ గతంలో ఇదే మాదిరిగా ఎన్నో సినిమాలను స్టార్ట్ చేయనున్నట్లు ట్వీట్ చేసి సెట్స్ పైకి తేకుండానే ఆపేశారు. ఆ కౌంట్ ఇప్పటికే 50 దాటింది. ఇక ఇప్పుడు వర్మ ఆవేశం చూస్తుంటే.. దిశా ఘటనను తప్పకుండా తెరపైకి తెప్పించేలా ఒక ప్రయత్నం చేయబోతున్నాడని అర్ధమవుతోంది. మరీ ఆయన ఎంతవరకు బయపెడతాడో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.