సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతారపై తమిళ నిర్మాతల్లో క్రమంగా వ్యతిరేకత పెరుగుతోంది. నయనతార సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్. నయన్ కు ఉన్న క్రేజ్ తో ఆమెకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకైనా నిర్మాతలు సిద్ద పడుతారు. ఆ విషయంలో నిర్మాతలకు నయన్ పై ఎలాంటి కంప్లైంట్స్ లేవు. 

కానీ నయనతార పెట్టే కండిషన్స్, సెట్స్ లో ఆమె వ్యవహరించే తీరు నిర్మాతలకు గుదిబండలా మారుతోంది. తాజాగా నయనతారపై తమిళ నిర్మాత కె. రాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నయనతారకు రెమ్యునరేషన్ మాత్రమే కాక ఆమె అదనపు ఖర్చులు కూడా తామే భరించాల్సి వస్తోందని రాజన్ అన్నారు. 

నయనతార సెట్స్ కు తన వ్యక్తిగత సహాయకులతో వస్తుంది. ఆమెకు 7గురు సహాయకులు ఉన్నారు. వారి రోజువారీ జీతాలు కూడా నిర్మాతలే భరించాల్సి వస్తోంది. నయనతార వ్యక్తిగత సహాయకుల్లో ఒక్కఒక్కరికి రూ7 వేల నుంచి రూ 12 వేలు వరకు రోజుకు జీతం ఇవ్వాల్సి వస్తోంది. అంటే కేవలం ఒక్కరోజుకే ఆమె వ్యక్తిగత సహాయకుల కోసం తాము రూ 80వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. 

ధనుష్ వల్లే అమలాపాల్ విడాకులు.. పెళ్లి తర్వాత జరిగింది ఇదే, సంచలన కామెంట్స్!

ఇక కారుకి పెట్రోల్, డ్రైవర్ ఖర్చులు కూడా మేమే భరించాలి అని రాజన్ అన్నారు. అలాగే హీరోలకు, హీరోయిన్లకు ప్రత్యేకంగా క్యారవ్యాన్స్ ఏర్పాటు చేయాల్సి వస్తోంది అని రాజన్ అన్నారు. ఈ ఖర్చులన్నీ తాము భరించడం వల్ల సినిమా బడ్జెట్ ఎక్కువైపోతోంది రాజన్ వాపోయారు. 

హీరోలకే మైండ్ బ్లాక్.. మాస్ స్టెప్పులతో టాప్ లేపేసిన హీరోయిన్లు

ఇప్పటికే తమిళ నిర్మాతలంతా నయన్ పై గుర్రుగా ఉన్నారు. ఆమె అత్యధిక పారితోషికం అందుకుంటూ కూడా సినిమా ప్రచారానికి హాజరు కాదనే విమర్శ ఉంది. తాజాగా రాజన్ చేసిన వ్యాఖ్యలు నయన్ పై మరింతగా వ్యతిరేకతని పెంచేవిగా ఉన్నాయి. నయనతార ఇలాగే వ్యవహరిస్తే ఆమె చిత్రాలకు పనిచేసే నిర్మాతలు ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

యాంకర్ ప్రదీప్ కు షాక్.. కేసు నమోదుచేసిన యువకుడు, కారణం ఇదే!