క్రేజీ హీరోయిన్ అమలాపాల్ తన వ్యక్తిగత జీవితంలో  అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది. అందంతో, అభినయంతో ఆకట్టుకునే నటిగా ముందునుంచి అమలాపాల్ కు మంచి పేరు ఉంది. కెరీర్ ఆరంభంలో గ్లామర్ రోల్స్, కమర్షియల్ చిత్రాల్లో నటించిన అమల ప్రస్తుతం హీరోయిన్ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది. 

అమలాపాల్ జీవితంలో వివాహం ఒక చేదు అనుభవంగా మిగిలిపోయింది. నటిగా మంచి అవకాశాలు దక్కించుకుంటున్న తరుణంలో అమలాపాల్ తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ ని ప్రేమ వివాహం చేసుకుంది. 2014లో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 

కానీ రెండేళ్లకే మనస్పర్థల కారణంగా ఈ జంట విడాకులతో విడిపోయారు. వీరిద్దరూ విడిపోవడానికి గల కారణాల మాత్రం పేర్కొనలేదు. పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్లు అప్పట్లో పేర్కొన్నారు. కాగా గత ఏడాది విజయ్ ఓ వైద్యురాలిని రెండో వివాహం చేసుకున్నాడు. అమలాపాల్ మాత్రం నటిగా కొనసాగుతోంది. 

ఇదిలా ఉండగా నటుడు, విజయ్ తండ్రి అయినా అళగప్పన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో విజయ్, అమలాపాల్ విడాకుల గురించి కుండబద్దలు కొట్టేశాడు. వీరిద్దరూ విడిపోవడానికి కారణం హీరో ధనుష్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

హీరోయిన్ కి బాలయ్య ఫోన్, ఒప్పుకుంటుందా?

పెళ్లి తర్వాత అమలాపాల్ నటించకూడదని నిర్ణయించుకుంది. కానీ ధనుష్ ఆమెని కలసి నటించేందుకు ఒప్పించాడు. అలా ధనుష్ నిర్మించిన అమ్మా కణుకు చిత్రంలో అమల నటించింది. వీరిద్దరూ జంటగా రఘువరన్ బిటెక్, విఐపి2 చిత్రాల్లో నటించారు. అమలాపాల్ సినిమాల్లో తిరిగి నటించడం మొదలుపెట్టాక విజయ్ తో మనస్పర్ధలు ఏర్పడ్డాయని అళగప్పన్ తెలిపారు. అళగప్పన్ వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో కలకలం సృష్టిస్తున్నాయి.