టాలీవుడ్ లో తిరుగులేని యాంకర్ గా సుమ దూసుకుపోతోంది. దాదాపుగా అన్ని టాలీవుడ్ ఈవెంట్స్ లో సుమనే యాంకర్ గా ఎంపిక చేసుకుంటారు. యాంకరింగ్ లో ఆమె ప్రతిభ, సమయస్ఫూర్తి, హాస్య చతురత ఇందుకు కారణం. కుర్ర యాంకర్ ఎంతమంది వచ్చినా సుమకు పోటీ కాలేకున్నారు. 

సినిమా ప్రముఖులపై ఐటి దాడులుకానీ, జీఎస్టీ రైడ్స్ కానీ జరిగితే మీడియాలో హాట్ టాపిక్ గా మారడం సహజం. శుక్రవారం రోజు హీరోయిన్ లావణ్య త్రిపాఠితో పాటు సుమ,అనసూయ లాంటి టాలీవుడ్ సెలెబ్రిటీల ఇళ్లలో జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహించినట్లు వార్తలు వచ్చాయి. 

కోట్లాది రూపాయల్లో ఈ సెలెబ్రిటీలు జీఎస్టీ ఎగవేతకు పాల్పడ్డారనే ఆరోపణలతో అధికారులు వారి ఇళ్లలో దాడులు నిర్వహించినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తన నివాసంలో జీఎస్టీ అధికారులు దాడులు నిర్వహించినట్లు వస్తున్న వార్తలపై సుమ తాజాగా స్పందించారు. ఈ వార్తలని ఆమె ఖండించారు. 

'ఈ మధ్య ఓ వార్త రౌండ్స్ కొడుతోంది.. సుమ ఇంట్లో జీఎస్టీ రైడ్స్ జరిగాయి.. సుమ జీఎస్టీ కట్టలేదు అని అంటున్నారు. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవం. నేన కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నా. ప్రభుత్వానికి చెల్లించవలసిన అని పన్నులని సకాలంలో చెల్లిస్తున్నా. నా వద్ద రికార్డులు కూడా ఉన్నాయి. నేనెప్పుడూ చట్టానికి లోబడే ఉంటాను. 

'ప్రతిరోజూ పండగే' సెకండ్ డే కలెక్షన్స్.. పట్టునిలుపుకున్న తేజు సినిమా!

ఇలాంటి గాసిప్స్ చాలానే వస్తుంటాయి. అన్నింటిని ఖండిస్తూ కూర్చోలేం.. కానీ నేను సైలెంట్ గా ఉంటే ఈ వార్త జనాల్లోకి వెళ్లి ఇదే నిజం అనుకునే ప్రమాదం ఉంది. అందుకే స్పందించాల్సి వచ్చింది. ఇలాంటి అసత్య ప్రచారాల్ని నమ్మొద్దు' అని సుమ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 

బోల్డ్ సీన్లకు రెడీ.. 41ఏళ్ల హీరోయిన్ హాట్ కామెంట్స్!

లావణ్య త్రిపాఠి, సుమ, అనసూయ ఇళ్లలో జీఎస్టీ సోదాలు..కారణం ఇదే

హీరోయిన్ లావణ్య త్రిపాఠికి షాక్.. ఇంట్లో సోదాలు.. కోట్లలో ఎగవేత..