మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన ప్రతిరోజూ పండగే చిత్రం డిసెంబర్ 20న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మారుతి దర్శత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించగా సత్యరాజ్, రావు రమేష్ కీలక పాత్రల్లో నటించారు. 

ప్రతిరోజూ పండగే చిత్రం మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. వినోదంతో పాటు మంచి సందేశాన్ని మారుతి ఈ చిత్రం ద్వారా అందించారు. తొలి రోజు ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 4 కోట్ల వరకు షేర్ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ లభించాయి. 

ఏపీ, తెలంగాణాలో తొలి రోజు ప్రతి రోజూ పండగే చిత్రం 3.13 కోట్ల షేర్ కొల్లగొట్టింది. సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుండడంతో శనివారమైన రెండవరోజు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా రాణించింది. పట్టు నిలుపుకుంటూ రెండవ రోజు తెలుగు రాష్ట్రాల్లో 2.60 కోట్ల షేర్ రాబట్టింది. ప్రతిరోజూ పండగే చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ కు ఇది నిదర్శనం అని చెప్పొచ్చు. 

శనివారంతో పోల్చుకుంటే ఆదివారం రోజు అడ్వాన్స్ బుకింగ్స్, ఆక్యుపెన్సీ అధికంగా ఉండనుంది. దీనితో సండే రోజు కూడా ప్రతి రోజూ పండగే చిత్రం నుంచి బలమైన వసూళ్లు ఊహించవచ్చు. 

అల్లు అర్జున్ మూవీ.. ఒక పని పూర్తి చేసిన సుకుమార్!

ఇక ఏరియాల వారీగా చూస్తే నైజాంలో ఈ చిత్ర రెండు రోజుల షేర్ 2.45 కోట్లకు చేరింది. గుంటూరులో 45 లక్షలు, సీడెడ్ లో 66 లక్షలు, ఉత్తరాంధ్రలో 80 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 47 లక్షలు, వెస్ట్ లో 34, కృష్ణాలో 38లక్షలు, నెల్లూరులో 25 లక్షల షేర్ ని ఈ చిత్రం రాబట్టింది. 

ఉత్తమ నటుడు రాంచరణ్.. ఫిలిం ఫేర్ లో 'రంగస్థలం'కే ఐదు!

ప్రతిరోజూ పండగే చిత్రంలో మారుతి మార్క్ కామెడీ, తేజు స్క్రీన్ ప్రజెన్స్, రావు రమేష్ నటన, తమన్ సంగీతం హైలైట్ గా నిలిచాయి.