అందాల రాక్షసి చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన లావణ్య త్రిపాఠి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ సొట్టబుగ్గల సుందరికి యువతలో మంచి పాపులారిటీ ఏర్పడింది. లావణ్య టాలీవుడ్ లో దూసుకెళ్తా, సోగ్గాడే చిన్నినాయనా, భలే భలే మగాడివోయ్, శ్రీరస్తు శుభమస్తు లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది. 

తాజాగా లావణ్య త్రిపాఠికి ఊహించని షాక్ ఎదురైంది. శుక్రవారం రోజు జీఎస్టీ అధికారులు హైదరాబాద్ లోని ఆమె నివాసంలో దాడులు నిర్వహించారు. లావణ్య త్రిపాఠి కోట్లాది రూపాయల జీఎస్టీ ఎగవేతకు పాల్పడిందనే ఆరోపణలతో 'డిజిజిఐ' అధికారులు ఆమె నివాసంలో సోదాలు నిర్వహించారు. 

దారుణంగా పడిపోయిన ఆర్జీవీ మార్కెట్.. క్రియేటివ్ డైరెక్టర్ పరిస్థితి ఇలా!

ఈ విషయం తెలుసుకున్న లావణ్య త్రిపాఠి షూటింగ్ నుంచి అర్థాంతరంగా ఇంటికి చేరుకున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న లావణ్య ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తోంది. ఇటీవలే లావణ్య అర్జున్ సురవరం చిత్రంతో విజయాన్ని అందుకుంది. అగ్ర హీరోయిన్ల స్థాయిలో కాకున్నా లావణ్య కూడా నిర్మాతల నుంచి మంచి పారితోషికమే అందుకుంటోంది. 

యంగ్ డాక్టర్ తో నితిన్ ఎఫైర్.. మ్యాచ్ ఫిక్స్ కాలేదంటూ వార్తలు!

కేవలం లావణ్య త్రిపాఠి నివాసంలో మాత్రమే కాక.. హైదరాబాద్ లోని 23 ప్రాంతాల్లో డిజిజిఐ టీమ్స్ సోదాలు నిర్వహించాయి. జీఎస్టీ అధికారుల దాడులపై లావణ్య త్రిపాఠి స్పందించాల్సి ఉంది. ప్రస్తుతం లావణ్య త్రిపాఠి సందీప్ కిషన్ సరసన ఏ1 ఎక్స్ ప్రెస్ చిత్రంలో నటిస్తోంది. 

దబంగ్3 స్క్రీనింగ్: చీరలో మెరిసిన సల్మాన్ గర్ల్ ఫ్రెండ్.. పూజా హెగ్డే, సన్నీలియోన్ సందడి!