నటి లావణ్య త్రిపాఠి ఇంట్లో జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసంపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) అధికారుల దాడులు చేశారు. ఈ విషయం తెలుసుకున్న లావణ్య సినిమా షూటింగ్ రద్దు చేసుకుని ఇంటికి చేరుకుంది.
నటి లావణ్య త్రిపాఠి ఇంట్లో జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసంపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) అధికారుల దాడులు చేశారు. ఈ విషయం తెలుసుకున్న లావణ్య సినిమా షూటింగ్ రద్దు చేసుకుని ఇంటికి చేరుకుంది. అలాగే ప్రముఖ యాంకర్లు సుమ కనకాల, అనసూయ భరద్వాజ్ ఇళ్లలో శుక్రవారం జీఎ్సటీ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఇక కొన్ని సంస్థల్లో లావణ్య త్రిపాఠి, సుమ, అనసూయ పెట్టుబడులు పెట్టారని, ఆ సంస్థలపై సర్వీస్ ట్యాక్స్, జీఎ్సటీ ఎగ్గొట్టిన ఆరోపణలున్నట్లు సమాచారం. ఆ సంస్దల సోదాల్లో భాగంగానే వీరిందరిపై సోదాలు జరిగినట్లు తెలుస్తోంది.
దారుణంగా పడిపోయిన ఆర్జీవీ మార్కెట్.. క్రియేటివ్ డైరెక్టర్ పరిస్థితి ఇలా!
చిట్‌ఫండ్ కంపెనీలు, కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు, సాఫ్ట్‌వేర్ కంపెనీలు, కన్‌స్ట్రక్షన్ కంపెనీలతో పాటు ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీల్లోనూ ఉదయం నుంచి డీజీజీఐ సోదాలు చేసింది. రూ.కోట్లలో సర్వీస్‌ట్యాక్స్, జీఎస్టీ ఎగవేసినట్లు ఆరోపణలు రావడంతో వీరిపై దాడులు జరుగుతున్నాయి. అయితే ఆమెకు సంబంధించిన ఆస్తులపై దాడులు జరగడం ఇదే తొలిసారి.
హీరోయిన్ లావణ్య త్రిపాఠికి షాక్.. ఇంట్లో సోదాలు.. కోట్లలో ఎగవేత..
లావణ్య త్రిపాఠి A1 ఎక్స్‌ప్రెస్ చిత్రం షూటింగ్ బిజీగా ఉన్నారు. A1 ఎక్స్‌ప్రెస్ సందీప్ కిషన్ హీరోగా నటిస్తోన్నారు. ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి హాకీ క్రీడాకారిణిగా కనిపించనున్నట్లు సమాచారం. రీసెంట్ గా నిఖిల్ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన అర్జున్ సురవరం చిత్రం విజయం నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే.
