సినిమాల్లో శృంగార సన్నివేశాలను ఎలా చిత్రీకరిస్తారనే సందేహం చాలా మందిలో ఉంటుంది. సాధారణ సన్నివేశాలను చిత్రీకరించే సమయంలో సెట్ లో వందల మంది ఉంటారు. అంతమంది ముందు సాధారణ సన్నివేశాల్లో నటించడం తారలకు అలవాటే..

మరి శృంగార సన్నివేశాలను అంతమంది ముందు ఎలా చిత్రీకరిస్తారు..? ఓ చిన్న సీన్ కోసమే టేకుల మీద టేకులు తీసుకునే తారలు ఇంటిమేటెడ్ సీన్స్ చేసేప్పుడు కూడా అలానే నటిస్తారా..? అనే సందేహాలు రావొచ్చు.. ఈ ప్రశ్నకి 'టాంబ్ రైడర్' హీరోయిన్ అలిసియా వికందేర్ ఆసక్తికర సమాధానం చెప్పుకొచ్చింది.

Jabardasth: దర్శకులతో నాగబాబు ప్లాన్.. జబర్దస్త్ కి కోలుకోలేని దెబ్బ!

ఏమాత్రం తడుముకోకుండా.. తనదైన శైలిలో సమాధానమిచ్చింది. సెక్స్ సీన్స్ లో నటించేప్పుడు పరిమిత సంఖ్యలోనే యూనిట్ సభ్యులు ఉండాలని, సింగిల్ టేక్ లోనే  సన్నివేశాన్ని షూట్ చేసేయాలని ముందుగానే దర్శకనిర్మాతలకు షరతులు పెడుతోందట.

అందుకు ఒప్పుకుంటేనే తాను ఆ తరహా సీన్స్ లో నటించడానికి ఒప్పుకుంటానని చెప్పుకొచ్చింది. ఇరవై ఏళ్ల వయసులోనే సెక్స్ సీన్స్ లో నటించానని.. త‌న కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు న‌టించిన శృంగార సన్నివేశాలు సాంకేతిక‌మైన‌వే త‌ప్ప‌.. మ‌రేమీ కావ‌ని వెల్లడించింది ఈ బ్యూటీ.

ఇటీవలఅలిసియా నటించిన 'ది ఎర్త్ క్వేక్ బర్డ్' అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.