బుల్లితెరపై 'జబర్దస్త్' కామెడీ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు ఈ షో వస్తుందంటే చాలు.. టీవీలకు అతుక్కుపోతారు. యూట్యూబ్ లో ఈ షోకి సంబంధించిన వీడియోలకు కోట్లలో వ్యూస్ వస్తుంటాయి. అంతగా పాపులర్ అయిన ఈ షో ఇప్పటివరకు ఏ టీవీ షో దెబ్బకొట్టలేకపోయింది.

టీఆర్పీ రేటింగ్స్ లో అగ్రస్థానంలో దూసుకుపోతుంది. ఈ షోని కాపీ కొడుతూ చాలా టీవీ షోలు వచ్చాయి. అప్పట్లో 'జబర్దస్త్'కి పోటీగా మాటీవీలో 'దేశముదుర్లు' అనే షో వచ్చింది. కానీ అది ఎప్పుడు వచ్చిందో పోయిందో కూడా జనాలకు తెలియదు. ఈటీవీ యాజమాన్యం స్వయంగా ఈ షోకి పోటీగా మరికొన్ని షోలు మొదలుపెట్టింది.

'పటాస్' షోకి గుడ్ బై చెప్పిన యాంకర్ రవి..?

కానీ 'జబర్దస్త్' ముందు ఏదీ నిలవలేకపోయింది. అయితే ఇప్పుడు ఓ పోటీ ఛానెల్ లో 'జబర్దస్త్'కి షాకిచ్చే ఒక ప్రోగ్రాం మొదలుకానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ షో కూడా పాత షోల మాదిరి ఫ్లాప్ అవుతుందని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ప్రస్తుతం 'జబర్దస్త్' షోని ఏలుతున్న టీమ్ లీడర్లతో పాటు జడ్జిగా వ్యవహరిస్తున్న నాగబాబు సైతం ఆ షోకి వెళ్లబోతున్నట్లు మాటలు వినిపిస్తున్నాయి.

నిజానికి 'జబర్దస్త్' షోని నడిపించే ఇద్దరు డైరెక్టర్లు ఇప్పటికే ఆ షోకి గుడ్ బై చెప్పేశారట. మల్లెమాల ఎంటర్టైన్మెంట్ వాళ్లతో వచ్చిన విభేదాల కారణంగా దర్శకులు ఇద్దరూ షో వదిలేయాలని నిర్ణయించుకున్నారు. వాళ్లు నాగబాబుతో పాటు హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర లాంటి టీమ్ లీడర్లను కొత్త షో వైపు లాగేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అదే గనుక నిజమైతే.. 'జబర్దస్త్' షోకి క్రేజ్ తగ్గడం ఖాయం. చాలా మంచి 'జబర్దస్త్' షో చూసేదే హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్రల స్కిట్ ల కోసం. అలాంటిది ఆ ముగ్గురే లేకపోతే షో టీఆర్పీ రేటింగులు దారుణంగా పడిపోయే అవకాశాలు ఉన్నాయి. మరి ఇదంతా జరగకుండా 'జబర్దస్త్' నిర్వాహకులు అడ్డుకోగలరో లేదో చూడాలి!