సౌత్ రొమాంటిక్ హీరోల్లో దుల్కర్ సల్మాన్ ఒకరు. దుల్కర్ సల్మాన్ కు లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ. మమ్ముట్టి తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. దుల్కర్ సల్మాన్ వృత్తిని ఎంతగా ప్రేమిస్తాడో తన ఫ్యామిలీకి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాడు.

దుల్కర్ సల్మాన్ సతీమణి అమల్ సుఫియా. వీరిద్దరికి ఓ పాప సంతానం. తాజాగా దుల్కర్ సల్మాన్ తన ప్రేమ, పెళ్లి విషయాలని ఓ ఇంటర్వ్యూలు వివరించారు. తమది లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని దుల్కర్ తెలిపాడు. నేను యుఎస్ నుంచి అప్పుడే చదువు పూర్తి చేసుకుని వచ్చాను. 

నటి మహీన కుమారి వెడ్డింగ్ వీడియో.. సో బ్యూటిఫుల్

మా ఇంట్లో అంతా నా పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారు. నా కుటుంబ సభ్యులు, స్నేహితులు కలసి ఒక అమ్మాయి గురించి చెప్పారు.  ఆ అమ్మాయి నేను ఒకే స్కూల్ లో కలసి చదువుకున్నాం. ఆమె నాకన్నా ఐదేళ్లు జూనియర్ కావడం వల్ల తన గురించి పెద్దగా తెలియదు. నా ఫ్రెండ్స్ ఆమె గురించి చెప్పాక.. అదేంటో విచిత్రంగా నేను ఎక్కడకు వెళ్లినా ఆమె అక్కడకు వచ్చేది. 

సినిమా థియేటర్ లో కూడా ఓ సారి చూశా. దీనితో నా ఫ్రెండ్స్ ఆమె బయో డేటా సేకరించారు. ఆ తర్వాత ఆమెతో ఎలాగైనా మాట్లాడాలని డిసైడ్ అయ్యా. ధైర్యం చేసుకుని ఒక రోజు కాఫీకి పిలిచా. ఆ తర్వాత ఆమె గురించి మాయా కుటుంబ సభ్యులకు చెప్పా. ఇరు కుటుంబ సభ్యులు మాట్లాడుకుని మా వివాహం ఫిక్స్ చేశారు. అలా తన వివాహం అమల్ సుఫియాతో 2011 లో జరిగిందని దుల్కర్ తెలిపాడు.