అమరావతి: గతంల ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేపట్టి నవరత్నాలను అందిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి నేటికీ ఏ ఒక్క రత్నాన్ని ప్రజలకు అందించలేకపోయారని ముఖ్యమంత్రి  జగన్ పై టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రజల సమస్యను తీర్చాల్సింది పోయి స్వయంగా ప్రభుత్వమే ప్రజలకు కష్టాల్లోకి నెడుతోందని అన్నారు. ఆర్టీసి చార్జీల పెంపు నిర్ణయం అలాంటిదేనని ఆరోపించారు. 

బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వెంకన్న మాట్లాడారు. నిరుపేద, సామాన్య ప్రజానికానికి ఇబ్బంది రాకూడదనే గత టీడీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలుగా ఒక్క పైసాకూడా చార్జీలు పెంచలేదన్నారు. కానీ జగన్ పాలన మొదలై ఆరునెలలే అవుతున్నా ఆర్టీసీ ఛార్జీలను ఒక్కసారిగా పెంచేశారని అన్నారు. ఈ నిర్ణయంతో సుమారు వెయ్యి కోట్ల రూపాయలు సామాన్యుడిపై భారం పడుతోందన్నారు.

ఈ చార్జీల పెంపుకు నిరసనగా రాష్ట్రంలోని అన్ని డిపోల వద్ద పేదల పక్షాన పోరాటం చేస్తామని పిలుపునిచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేది పేద ప్రజలే కాబట్టి వారికే దీనివల్ల ఎక్కువ నష్టం జరుగుతుందన్నారు. కాబట్టి పేదల సంక్షేమమే మా లక్ష్యమనే వైసీపీ నాయకులకు ఈ విషయం తెలియటం లేదా అని ప్రశ్నించారు. 

ఒక్కసారే భారీగా పెంచిన ఆర్టీసి ఛార్జీలకు వెంటనే తగ్గించాలని డిమాండ్  చేశారు. లేదంటే తెలుగు దేశం పార్టీ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తుందని బుద్దా వెంకన్న హెచ్చరించారు. 

read more ఇప్పటివరకు ఒకలెక్క...ఇప్పట్నుంచీ మరోలెక్క...రాయలసీమపై జగన్ వరాలు

మరో టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ... వైసిపి ప్రభుత్వం అనేక రకాలుగా పేదల నడ్డి విరిచేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. కేవలం నిరుపేద, సామాన్య వర్గాల  ప్రజలపైనే దాడిచేసేందుకు సీఎం జగన్ పూనుకున్నారని అన్నారు. అందులో భాగంగానే వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలను  పెంచిందని... వెంటనే వీటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.  

బీజేపీ ఎమ్మెల్సీ సోము వీరాజు కూడా ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై మాట్లాడుతూ...ఈ నిర్ణయాన్ని తామువ్యతిరేకిస్తున్నామని అన్నారు.  అలాగే అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర అందించడంలో అన్ని ప్రభుత్వాలు విఫలం అయ్యాయని అన్నారు. ధరలు పెరగడంకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించే అధికార యంత్రాంగం ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు లేవా? అని ప్రశ్నించారు. 

onion crisis video: ఉల్లి కోసం పోరాటం... కిలో మీటర్ మేర క్యూ

గతంలో డీల్లీలో ఉల్లి ధర పెరగడం వలన బీజేపీ ఓటమి పాలైన విషయాన్ని వీర్రాజు గుర్తు  చేశారు. ఉభయ సభల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు విమర్శలకు కాకుండా ప్రజలకు మేలు చేసే పనులకు శ్రీకారం చుట్టాలని ఎమ్మెల్సీ వీర్రాజు విజ్ఞప్తి చేశారు.