నెల్లూరు: భూ వివాదం ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎట్టకేలకు పోలీసుల విచారణకు హాజరయ్యారు. నెల్లూరులోని వెంకటాచల సత్రం పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. సుమారు నాలుగు గంటలపాటు పోలీసులు సోమిరెడ్డిని విచారించారు. 

తనపై తప్పుడు కేసులు పెట్టించి వేధింపులకు పాల్పడుతున్నారంటూ మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తాను 20 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన 2 ఎకరాల 41 సెంట్లు భూమిపై ఫిర్యాదు చేయడం దాన్ని సివిల్ కేసుగా నమోదు చెయ్యడం జరిగిందన్నారు. 

అనేక ఆస్తులు తాను కొనుగోలు చేశానని కానీ 2 ఎకరాల 41 సెంట్లపై సివిల్ సూట్ వేశారని ఆరోపించారు. సివిల్ కేసు వివాదం కోర్టులో పెండింగ్ లో దాన్ని దాచిపెట్టి ప్రైవేట్ క్రిమినల్ కేసు పెట్టడం జరిగిందన్నారు. 

తాను వివాదం ఎదుర్కొంటున్న భూమి 1933లో తన బంధువులు వేలంలో కొనుగోలు చేశారని చెప్పుకొచ్చారు. ఆ భూమిని అమ్ముకునేందుకు తాను ప్రయత్నిస్తే తనపై కేసులు పెట్టారని ఆరోపించారు. 

తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తనపై తప్పుడు క్రిమినల్ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ఆరోపించారు. అన్నింటిపై చట్టపోరాటం చేస్తానని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు.    
 

ఈ వార్తలు కూడా చదవండి

అజ్ఞాతం వీడిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

కేసుల్లో టీడీపీ నేతలు: అజ్ఞాతంలో మరో మాజీమంత్రి

సరస్వతి భూముల కోసమే నాపై కేసులు: అజ్ఞాతం వీడిన యరపతినేని

సోమిరెడ్డికి షాక్.. భూ వివాదంలో నోటీసులు

కేసులు పెడతారని ఊహించా: సోమిరెడ్డి

ఫోర్జరీ సంతకాలు.. భూమి విక్రయం: మాజీ మంత్రి సోమిరెడ్డిపై కేసు నమోదు