ఐసిసి స్పెషల్... మరో అరుదైన ఘనత సాధించిన రోహిత్ శర్మ
ఇంగ్లాండ్ వేదికన జరిగిన ఐసిసి ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇలా ఈ మెగా టోర్నీలో అత్యధిక పరుగులతో గోల్డెన్ బ్యాట్ అందుకున్న అతడిపై మరోసారి ఐసిసి ప్రశంసలు కురిపించింది.
ప్రపంచ కప్ మెగా టోర్నీలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ విశ్వరూపం చూపించిన విషయం తెలిసిందే. తన అద్బుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో ఐదు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీతో చెలరేగి టీమిండియాను విజయాలబాటలో నడిపించాడు. ఇలా ఈ టోర్నమెంట్ లో 648 పరుగులు చేసిన అతడు అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచి ఐసిసి నుండి గోల్డెన్ బ్యాట్ కూడా అందుకున్నాడు. తాజాగా ఐసిసి రోహిత్ కు మరో అరుదైన గౌరవాన్ని అందించింది.
ఈ మెగా టోర్నీలో అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టి ఐదుగురు ఆటగాళ్ల జాబితాను ఐసిసి ప్రత్యేకంగా రూపొందించింది. ఈ జాబితాలో టీమిండియా విధ్వంసకర ఓపెనర్ రోహిత్ శర్మ మొదటి స్థానంలో నిలిచాడు. ఈ టాప్ 5 ఆటగాళ్ల జాబితాలో టీమిండియా నుండి మరే ఆటగాడికి చోటు దక్కలేదు. 81 సగటుతో పరుగులు సాధిస్తూ టీమిండియా ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ కీలకంగా వ్యవహరించినందుకే అతడికి టాప్ 1 స్థానాన్ని కట్టబెట్టినట్లు ఐసిసి తెలిపింది.
ఇక ఈ జాబితాలో రోహిత్ తర్వాత స్థానాన్ని డేవిడ్ వార్నర్ దక్కించుకున్నాడు. అతడు ప్రపంచ కప్ టోర్నీలో అత్యధిక పరుగులు బాదిన రెండో బ్యాట్ మెన్. 71 సగటులో 647 పరుగులు చేసి ఆసిస్ విజయంలో కీలకపాత్ర పోషించినందుకు వార్నర్ టాప్ 2 స్థానాన్ని ఆక్రమించాడు. ఇక బంగ్లా ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ మూడు, కివీస్ కెప్టెన్ విలియమ్సన్ నాలుగు, ఇంగ్లాండ్ క్రికెటర్ జో రూట్ ఐదో స్థానాన్ని ఆక్రమించాడు. వీరందరు కూడా వరల్డ్ కప్ టోర్నీలో అత్యధిక పరుగుల సాధించిన ఆటగాళ్లే కావడం విశేషం.
మరిన్ని వార్తలు
ప్రపంచ కప్ 2019: వాటిపై ఐసిసి సీరియస్ గా దృష్టిపెట్టాలి: రోహిత్ శర్మ
టార్గెట్ 2023 వరల్డ్ కప్... టీమిండియా కెప్టెన్ గా రోహిత్...?
ప్రపంచ కప్ 2019: టీమిండియా మిస్సయింది....కానీ రోహిత్ మాత్రం పట్టేశాడు