బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్‌కు క్యాన్సర్‌గా తేలడంతో సినీ ప్రముఖులతో పాటు పలువురు ప్రముఖులు సైతం దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇక ఆయన అభిమానుల సంగతి ప్రత్యేకంగా చెప్కక్కర్లేదు.

ఈ నేపథ్యంలో సంజయ్ దత్‌ క్యాన్సర్ నుంచి త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ కోరారు. ‘‘సంజయ్ దత్.. నువ్వు ఒక ఫైటర్‌లా కనిపిస్తావు.. నీ బాధ తెలుసుకున్నా.. ఆ నొప్పి ఎలా ఉంటుందో తాను అర్థం చేసుకోగలనని యువీ అన్నాడు.

Also Read:సంజయ్‌ దత్‌ ఆరోగ్య పరిస్థితిపై భార్య స్టేట్‌మెంట్‌.. బాబాకి ఏమైంది?

ఎందుకంటే ఆ నొప్పిని తాను స్వయంగా అనుభవించానని చెప్పాడు. కానీ ఆ నొప్పిని భరించేందుకు నువ్వు మరింత ధృడంగా తయారవ్వాలి... క్యాన్సర్ మహమ్మారి నుంచి తొందరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు యువరాజ్ ట్వీట్ చేశాడు.

గతంలో యువరాజ్ సింగ్ సైతం క్యాన్సర్ మహమ్మారి బారినపడిన సంగతి తెలిసిందే. 2011 ప్రపంచకప్ అనంతరం యువరాజ్ లండన్ వెళ్లి శస్త్రచికిత్స చేయించుకుని క్యాన్సర్‌పై విజయం సాధించి పలువురికి ఆదర్శంగా నిలిచాడు.

Also Read:మద్యం మత్తులో శ్రీదేవి రూంకి వచ్చిన సంజయ్‌ దత్‌.. వణికిపోయిన అతిలోకసుందరి

కాగా గత ఆదివారం అనారోగ్య సమస్యతో ముంబైలోని నానావతి ఆసుపత్రిలో సంజయ్ దత్ చేరారు. ఈ క్రమంలో ఆయనకు ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లుగా బాలీవుడ్ టాక్.

ప్రస్తుతం సంజయ్ దత్‌కు క్యాన్సర్ 4వ దశలో ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి చికిత్స చేయించుకోవడానికి ఆయన మంగళవారం రాత్రి అమెరికా వెళ్లినట్లుగా తెలుస్తోంది.