Asianet News TeluguAsianet News Telugu

రాహుల్ ద్రవిడ్ తర్వాత టీమిండియా ప్రధాన కోచ్ ఎవరు? బీసీసీఐ దరఖాస్తుల ఆహ్వానం.. అర్హతలు ఏమిటి?

Team India : బీసీసీఐ టీమిండియా ప్రధాన కోచ్ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ప్ర‌స్తుతం రాహుల్ ద్ర‌విడ్ ప్ర‌ధాన కోచ్ గా ఉండ‌గా, టీ20 ప్రపంచకప్ తర్వాత టీం ఇండియాకు కొత్త కోచ్‌ని నియమిస్తారని బోర్డు సెక్రటరీ జై షా ఇప్పటికే చెప్పారు.
 

Who is the head coach of Team India after Rahul Dravid? BCCI invites applications.. these are the qualifications RMA
Author
First Published May 14, 2024, 6:35 PM IST

Indian Cricket Team : బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ)  భార‌త క్రికెట్ జ‌ట్టు ప్రధాన కోచ్ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. టీ20 ప్రపంచకప్ తర్వాత టీం ఇండియాకు కొత్త కోచ్‌ని నియమిస్తారని బోర్డు సెక్రటరీ జై షా ఇప్పటికే చెప్పారు. ప్ర‌స్తుతం టీమిండియాకు ప్ర‌ధాన కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కోన‌సాగుతున్నారు. మరి ఇప్పుడు రాహుల్ ద్రవిడ్ అప్లై చేస్తాడా లేదా అనేది చూడాలి. ద్ర‌విడ్ దరఖాస్తు చేసుకోకపోతే కొత్త కోచ్ కోసం చూడ‌నుంది బీసీసీఐ. 

రాహుల్ ద్రవిడ్ పదవీకాలాన్ని పొడిగింపు.. 

ప్రధాన కోచ్ పదవికి మే 27 సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని బీసీసీఐ త‌న ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఎంపిక ప్రక్రియలో దరఖాస్తుల సమగ్ర సమీక్ష, ఇంటర్వ్యూలు, షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల అంచనా ఉంటుంది. గతేడాది వన్డే ప్రపంచకప్ తర్వాత రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసింది. బీసీసీఐ అభ్యర్థన మేరకు టీ20 ప్రపంచకప్ వరకు తన పదవీకాలాన్ని పొడిగించేందుకు అంగీకరించాడు.

టీమిండియా కోచ్ పదవీకాలం ఎలా ఉంటుంది?

కొత్త కోచ్ పదవీకాలం జూలై 1, 2024 నుండి ప్రారంభమవుతుంది. ఇది 31 డిసెంబర్ 2027 వరకు కొనసాగుతుంది. అంటే కొత్త కోచ్ పదవీకాలం 3 సంవత్సరాల 5 నెలలు. అటువంటి పరిస్థితిలో, కొత్త కోచ్‌కు మూడు పరిమిత ఓవర్ల ప్రపంచ కప్‌లు, 2 ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకోవడం సవాలుగా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 2025లో, టీ20 ప్రపంచకప్ ఫిబ్రవరి 2026లో, వ‌న్డే ప్రపంచకప్ 2027 అక్టోబర్-నవంబర్‌లో జరగాల్సి ఉంది.

భార‌త జ‌ట్టు ప్ర‌ధాన కోచ్ అర్హత ఏమిటి? 

కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 30 టెస్టులు లేదా 50 ఇన్దే మ్యాచ్‌లు ఆడిన అనుభవం కలిగి ఉండాలి. లేదా కనీసం 2 సంవత్సరాలు పూర్తి సభ్యునిగా టెస్ట్ ఆడే దేశానికి ప్రధాన కోచ్‌గా ఉండాలి.  లేదా ఐపీఎల్ జట్టు లేదా సమానమైన ఇంటర్నేషనల్ లీగ్/ఫస్ట్ డివిజన్ జట్లు/జాతీయ ఏ జట్ల కోచ్‌గా అసోసియేట్ మెంబర్/హెడ్ కోచ్‌గా కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. లేదా బీసీసీఐ లెవెల్ 3 సర్టిఫికేషన్ లేదా తత్సమానాన్ని కలిగి ఉండాలి. ఇక వయస్సు 60 ఏళ్లలోపు ఉండాలి.

గుజ‌రాత్ ఆశలపై నీళ్లు.. కేకేఆర్ తో మ్యాచ్ ర‌ద్దు.. ప్లేఆఫ్స్ రేసు నుంచి గిల్ జ‌ట్టు ఔట్..

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios