GT vs KKR : శుభ్‌మ‌న్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2024 ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. వ‌ర్షం కార‌ణంగా కేకేఆర్ తో జ‌రిగిన మ్యాచ్ ర‌ద్దు కావ‌డంతో ఇరు జ‌ట్ల‌కు ఒక్కో పాయింట్ ల‌భించింది.  

Gujarat Titans vs Kolkata Knight Riders : గత ఏడాది రన్నరప్ గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ తో కోల్ కతా కిట్ రైడర్స్ తో మ్యాచ్ రద్దవడంతో ఐపీఎల్ 2024 ప్లేఆప్ రేసు నుంచి ఔట్ అయింది. భారీ వ‌ర్షం కురుస్తుండ‌టంతో మ్యాచ్ కొన‌సాగే అవ‌కాశం లేక‌పోవ‌డం టాస్ ఆల‌స్యం అయింది. అయితే, వ‌ర్షం త‌గ్గ‌క‌పోవ‌డంతో మ్యాచ్ ర‌ద్దు అయింది. మరోవైపు ప్లేఆఫ్స్ లో చోటుద‌క్కించుకున్న కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ ప్ర‌త్తుం 19 పాయింట్ల తో ఐపీఎల్ 2024 పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లో ఉంది. మరోవైపు గుజరాత్ జట్టుకు ఇది డూ ఆర్ డై మ్యాచ్ అయినప్పటికీ వర్షం వారి ఆశలపై నీళ్లు చల్లింది. ఇప్పుడు గుజరాత్ జట్టు 13 మ్యాచ్‌ల్లో 11 పాయింట్లతో ఉంది. ఫైనల్ మ్యాచ్‌లో గెలిచినా 13 పాయింట్లకే చేరుకోగలదు. కాబ‌ట్టి జీటీ ప్లే ఆఫ్ రేసు నుంచి ఔట్ అయింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌లో టాస్ కూడా జరగకపోవడంతో చివర్లో ఇద్దరు కెప్టెన్లు నిరాశ‌ను వ్య‌క్తం చేశారు.

Scroll to load tweet…

కాగా, కేకేఆర్ చివరిసారిగా 2014లో టైటిల్ నెగ్గింది. కోల్‌కతా 2014 ఐపీఎల్‌ను గెలుచుకోవ‌డంతో ఛాంపియన్స్ లీగ్ టీ20కి అర్హత సాధించింది. కాగా, తాజా ఫలితంతో ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగే మ్యాచ్ నాకౌట్ మ్యాచ్ అవుతుందని, ఓడిన జట్టు కచ్చితంగా ఎలిమినేట్ అవుతుందని స్పష్టం చేసింది. గుజరాత్, కేకేఆర్ జట్లు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే పాయింట్ల పట్టికను ప్రభావితం చేయగలవు. మే 16న ప్లేఆఫ్ రేసులో ఉన్న హైద‌రాబాద్ తో తలపడేందుకు గుజరాత్ హైదరాబాద్ కు, మే 19న రాజస్థాన్ రాయల్స్ తో తలపడేందుకు కేకేఆర్ గౌహతికి వెళ్లనున్నాయి.