వెస్టిండీస్ విధ్వంసక ఆటగాడు కీరన్ పొలార్డ్‌ పొట్టి క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. బుధవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ద్వారా 500 టీ20లు ఆడిన తొలి క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు.

ఈ మ్యాచ్‌లో 15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 34 పరుగులు చేసిన పొలార్డ్, అదే సమయంలో టీ20ల్లో 10 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఉదాన బౌలింగ్‌లో సిక్సర్‌తో ఈ రికార్డు అందుకున్నాడు.

Also Read:బీసీసీఐ సెలక్టర్ రేసులో.. అగార్కర్‌కు మరో ఛాన్స్, ఎలాగంటే

 క్రిస్‌గేల్ 13,296 తర్వాత ఈ ఘనత అందుకున్న రెండో క్రికెటర్ పొలార్డే. మొత్తం టీ20 కెరీర్‌లో 15.97 స్ట్రైక్ రేటుతో 10,000 పరుగులు చేసిన పొలార్డ్ 280 వికెట్లు కూడా పడగొట్టాడు. ఇందులో ఒక సెంచరీ, 49 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.

మరోవైపు శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో వెస్టిండీస్ 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. సిమన్స్ 67 పరుగులతో రెచ్చిపోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 4 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.

Also Read:తిరగబడిన "0": ఇంగ్లాండ్ అప్పుడు గెలుపు... ఇప్పుడు ఓటమి

అనంతరం లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక 19.1 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్ అయ్యింది. పెరీరా 66 మినహా ఎవరూ రాణించకపోవడంతో లంక ఓటమి పాలయ్యింది. ఒషాన్ థామస్ 5/28తో శ్రీలంకను కుప్పకూల్చాడు.