తిరగబడిన "0": ఇంగ్లాండ్ అప్పుడు గెలుపు... ఇప్పుడు ఓటమి
మహిళల టి 20 ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్ పరిస్థితిని చూస్తేనే అయ్యో పాపం అనిపిస్తుంది. ఇంగ్లాండ్ జట్టు కనీసం బరిలోకి దిగకుండానే ఇంటి ముఖం పట్టవలిసి వచ్చింది. లీగ్ దశలో స్ఫూర్తిదాయకమైన ప్రదర్శన చేసినప్పటికీ... సెమీస్ ఆడే అవకాశం మాత్రం దక్కలేదు.
మహిళల టి 20 ప్రపంచ కప్ ఫైనల్లోకి భారత్ దూసుకెళ్లింది. తొలిసారిగా భారత్ టి 20 వరల్డ్ కప్ ఫైనల్స్ కి చేరుకోవడంతో భారత అభిమానులు పండగ చేసుకుంటున్నారు. భారత మహిళల జట్టుకు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు 8వ తేదీన ఆస్ట్రేలియా తో జరిగే ఫైనల్స్ కోసం అల్ ది బెస్ట్ కూడా చెబుతున్నారు.
భారత్ తరుఫున ఇదంతా బాగానే ఉంది. కానీ ఇంగ్లాండ్ పరిస్థితిని చూస్తేనే అయ్యో పాపం అనిపిస్తుంది. ఇంగ్లాండ్ జట్టు కనీసం బరిలోకి దిగకుండానే ఇంటి ముఖం పట్టవలిసి వచ్చింది. లీగ్ దశలో స్ఫూర్తిదాయకమైన ప్రదర్శన చేసినప్పటికీ... సెమీస్ ఆడే అవకాశం మాత్రం దక్కలేదు.
ఈ పరిస్థితులను చూస్తుంటే... 2019లో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అందరికి మనసులో మెదలడం తథ్యం. ఆ మ్యాచులో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ సమఉజ్జిలుగా నిలిచినప్పటికీ... మ్యాచులో ఎక్కువ బౌండరీలు కొట్టారన్న కారణంగా ఇంగ్లాండ్ ను విజేతగా ప్రకటించారు.
స్ఫూర్తిదాయకమైన ప్రదర్శనతో ఫైనల్ చేరిన న్యూజిలాండ్ ను చూసి ప్రతి ఒక్కరు పాపం అనడం తప్ప మరేం చేయలేకపోయారు. ఇలా బౌండరీలతో విజేతను నిర్ణయించడం ఏమిటని ప్రతి ఒక్కరు ప్రశ్నించారు. తొలిసారి కప్ గెలిచి ఇంటికి తీసుకెళ్లాలన్న కృతనిశ్చయంతో ఎంతో సమయోచిత ఆటతీరును ప్రదర్శించిన న్యూజిలాండ్ చివరకు ఆ కప్ ను ఎత్తుకోవడంలో మాత్రం విఫలమయింది.
ఇప్పుడు ఇంగ్లాండ్ జట్టును చూస్తుంటే,,, మరోసారి అప్పుడు న్యూజిలాండ్ జట్టును చూసి బాధపడ్డట్టు బాధపడాల్సి వస్తుంది. ఇంగ్లాండ్ జట్టు కూడా లీగ్ దశలో ఒక్కటంటే ఒక్కటే మంచును కోల్పోయి సెమిస్ లోకి ప్రవేశించింది. జట్టు కూడా అరివీర భయంకరమైన ఆటగాళ్లతో అలరారుతుంది. కానీ ఏం చేస్తాం అదృష్టం వారి పక్షాన నిలవలేదు.
ఇలా ఇంగ్లాండ్ ను చూసి ప్రపంచం లోని మేటి క్రికెటర్లంతా బాధపడుతున్నారు. కానీ ఇప్పుడు కూడా అప్పుడు లాగానే ఏం చేయగలుగుతారు బాధపడడం తప్ప.