ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ కోల్పోయిన తన ఫామ్ ని దొరకబుచ్చుకునే పనిలో నిమగ్నమయ్యాడని అతని ప్రస్తుత ప్రదర్శన మనకు నిరూపిస్తుంది. గత కొన్ని మ్యాచుల నుంచి తనను వెంటాడుతున్న పరుగుల దాహాన్ని తీర్చుకుంటున్నాడు. 

యాషెస్‌ సిరీస్‌లో ఘోరంగా విఫలమైన వార్నర్‌, పాకిస్తాన్‌తో జరిగిన తొలి టెస్టులో భారీ శతకంతో తన ఫామ్ ను దొరకబుచ్చుకున్నాడు. అదే జోరును రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సైతం కొనసాగించాడు. నిన్నటి తొలి రోజు ఆటలో సెంచరీ పూర్తి చేసుకున్న వార్నర్‌, ఈ రోజు తొలుత డబల్ సెంచరీ మార్క్ ను అందుకున్న్డు. వెనువెంటనే దాన్ని ట్రిపుల్‌ సెంచరీగా మలీచాడు. 

Also read: ఒకే ఓవర్లో 5 వికెట్లు...కర్ణాటక పేసర్ అభిమన్యు మిథున్ అరుదైన రికార్డు

394 బంతుల్లో 37 ఫోర్లతో వార్నర్‌ ట్రిపుల్‌ సెంచరీ నమోదు చేశాడు. వార్నర్‌కు టెస్టుల్లో ఇదే తొలి ట్రిపుల్‌ సెంచరీ కాగా, ఆస్ట్రేలియా తరఫున ఈ ఘనత సాధించిన ఏడో బ్యాట్స్‌మన్‌గా వార్నర్‌ రికార్డు సృష్టించాడు. 

ఇక పాకిస్తాన్‌పై ట్రిపుల్‌ సెంచరీ సాధించిన రెండో ఆసీస్‌ ఆటగాడిగా కూడా చరిత్రపుటల్లోకి ఎక్కాడు. మొత్తంగా గనుక చూసుకుంటే, చూస్తే టెస్టు ఫార్మాట్‌లో ట్రిపుల్‌ సెంచరీ సాధించిన 16వ ఆటగాడుగా  కూడా వార్నర్‌ చరిత్రలోకెక్కాడు.  

కాగా, డే అండ్‌ నైట్‌ టెస్టులో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన ఆటగాడిగా ఒక కొత్త రికార్డును వార్నర్‌ తన పేరిట లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్ కి పూర్వం, ఆ రికార్డు పాకిస్తాన్‌ కెప్టెన్‌ అజహర్‌ అలీ పేరిట ఉండగా, దాన్ని వార్నర్‌ బ్రేక్‌ చేశాడు.అజర్ అలీ 302 పరుగులు చేయగా,వార్నర్‌ 303 పరుగులు చేసాడు.  

Also read: ఈ వింత షాట్ ను ఎప్పుడైనా కన్నారా విన్నారా...

ఓవర్‌ నైట్‌ స్కోరు 302/1 వద్ద రెండో రోజు ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆస్ట్రేలియా తొలుత మార్నస్ లబూషేన్‌ వికెట్‌ను కోల్పోయింది. లబూషేన్‌ భారీ సెంచరీ చేసిన తర్వాత 162 పరుగుల వద్ద రెండో వికెట్‌గా వెనుదిరిగాడు.  

ఇకపోతే, డేవిడ్‌ వార్నర్‌ మాత్రం తన తొలి రోజు దూకుడునే కొనసాగించాడు. తొలి రోజు ఆటలో సెంచరీ పూర్తి చేసుకున్న వార్నర్‌, రెండో రోజు ఆటలో అదే పరుగుల దాహాన్ని కనబరుస్తూ, డబుల్‌ సెంచరీ మార్కును చేరాడు. 

166 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో తన ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన వార్నర్ ఎక్కడా కూడా తత్తరపడకుండా జాగ్రత్తగా తన ఇన్నింగ్స్ ను నిర్మించుకున్నాడు. సమయోచితంగా ఆడుతూ, డబల్ సెంచరీ పూర్తి చేసాడు.  ఆ తరువాత ఆ డబల్ సెంచరీ ని ట్రిపుల్ సెంచరీగా మలిచాడు. 

అవతలివైపు లబూషేన్, స్టీవ్‌ స్మిత్‌ వికెట్లు పడ్డప్పటికీ, వార్నర్‌ మాత్రం ఎటువంటి ఒత్తిడికి లోనవకుండా, ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. ఆ తరువాత 335 వ్యక్తిగత పరుగులవద్ద ఆస్ట్రేలియన్ కెప్టెన్ టీం పెయిన్ ఆసీస్ ఇన్నింగ్స్ ను 589/3 వద్ద డిక్లేర్ చేసాడు.