కర్నాటక ప్రీమియర్ లీగ్ (కెపీఎల్) మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో పోలీసుల నుంచి నోటీసు అందుకుని ఒత్తిడిలో ఉన్న భారత మాజీ పేసర్ అభిమన్యు మిథున్ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఇలా ఆకాశమే హద్దుగా చెలరేగాడు
సూరత్: వికెట్, వికెట్, వికెట్, వికెట్, వైడ్, 1, వికెట్... ఒకే ఓవర్లో కర్ణాటక పేస్ బౌలర్ అభిమన్యు మిథున్ ప్రదర్శన ఇది. దేశవాళీ టి20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీ సెమీస్ మ్యాచ్‌లో ఈ అరుదైన ఫీట్ నమోదైంది. చివరి ఓవర్లో చెలరేగిన మిథున్ ‘హ్యాట్రిక్’ సహా ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడు. ఇంకో ఆసక్తికర అంశమేంటంటే అన్ని వికెట్లు కూడా క్యాచ్ ల రూపంలోనే వచ్చాయి.
Also read : సంజు శాంసన్ ఎంపిక... పంత్ కు లక్ష్మణ్ చురకలు
కర్నాటక ప్రీమియర్ లీగ్ (కెపీఎల్) మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో పోలీసుల నుంచి నోటీసు అందుకుని ఒత్తిడిలో ఉన్న భారత మాజీ పేసర్ అభిమన్యు మిథున్ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఇలా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. హర్యానాతో ముస్తాక్ అలీ టీ20 టోర్నీ సెమీఫైనల్లో అభిమన్యు 5/39తో రెచ్చిపోయాడు.
ఆఖరు ఓవర్లో ఐదు వికెట్లు కూల్చిన అభిమన్యు కర్నాటక లక్ష్యాన్ని 200 లోపు ఉండేలా చూశాడు. తొలి మూడు ఓవర్లలో 37 పరుగులు ఇచ్చుకున్న అభిమన్యు మిథున్.. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో హ్యాట్రిక్ వికెట్లు సహా ఐదు వికెట్లు కూల్చాడు.
Also read: అవినీతి ఆరోపణలు: అంబటి రాయుడికి అజరుద్దీన్ రిప్లై
తొలుత బ్యాటింగ్ చేసిన హర్యానా 194/8 పరుగులు చేసింది. హిమాన్షు రానా (61), బిష్ణోరు (55) రాణించారు. ఛేదనలో కెఎల్ రాహుల్ (66), పడికాల్ (87) మెరవటంతో కర్నాటక 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 15 ఓవర్లలోనే కర్నాటక 195 పరుగులు చేసింది. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ ఫైనల్లోకి ప్రవేశించింది.
తొలి నాలుగు బంతులకు నాలుగు వికెట్లు తీసిన అతను తర్వాతి బంతిని వైడ్‌గా విసిరాడు. అనంతరం సింగిల్ ఇచ్చిన అతను చివరి బంతికి కూడా మరో వికెట్ పడగొట్టాడు. టి20 చరిత్రలో ఈ తరహా ఫీట్ రెండో సారి నమోదు కావడం విశేషం. భారత్ నుంచి ఇదే మొదటి సారి కాగా 2013లో బంగ్లాదేశ్ పేసర్ అల్ అమీన్ హుస్సేన్ ఇలాగే టి20 మ్యాచ్‌లో ఒకే ఓవర్లో 5 వికెట్లు తీశాడు
