Asianet News TeluguAsianet News Telugu

ఈ వింత షాట్ ను ఎప్పుడైనా కన్నారా విన్నారా...

న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌ నీల్‌ బ్రూమ్‌ కొట్టిన తాజా స్కూప్‌ షాట్‌ ప్రతీ ఒక్కర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. సాధారణంగా స్కూప్ షాట్ ఆడే బ్యాట్స్ మాన్ పూర్తిగా మోకాలి మీద కూర్చొని షాట్ ఆడుతాడు. అది పాడిల్ స్కూప్ అయినా, దిల్ స్కూప్ అయినా.. కానీ  ఈ కివీస్ బ్యాట్స్‌మన్‌ పెద్దగా శ్రమించకుండానే ఆడిన స్కూప్‌ షాట్‌ హైలైట్‌ అయ్యింది.

scoop shot taken to a new level...watch the below video
Author
Wellington, First Published Nov 30, 2019, 12:42 PM IST

క్రికెట్లో కొన్ని కొత్త షాట్లు పుట్టుకొస్తుంటాయి. అవి మొదటిసారి కొట్టిన తరువాత వాటికి పేర్లు పెడుతుంటారు. కొన్నిసార్లు వాటిని మొదటిసారి కొట్టిన ప్లేయర్ కన్నా తరువాత ఆ షాట్ ని బాగా ప్రాచుర్యంలోకి తెచ్చిన ప్లేయర్స్ పేరు మీద అవి స్థిరపడిపోయి ఉంటాయి. 

ఉదాహరణకు మనకు హెలికాప్టర్ షాట్ అంటే మొదటగా గుర్తొచ్చేది మహేంద్ర సింగ్ ధోని. కానీ ధోని కన్నా ముందు సచిన్ టెండూల్కర్, అజహరుద్దీన్ కూడా ఇలాంటి షాట్స్ ఆడినప్పటికీ ధోనికి వచ్చినంత గుర్తింపు మాత్రం వారికి రాలేదు. 

ఇలాంటి మరో షాట్ స్కూప్ షాట్. ఈ స్కూప్ లోనూ దిల్షాన్ పేరిట ఉన్న దిల్ స్కూప్ చాలా ఫేమస్. ఈ స్కూప్ షాట్ కు న్యూజిలాండ్ ప్లేయర్ నూతన సొగబులద్దాడు. 

న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌ నీల్‌ బ్రూమ్‌ కొట్టిన తాజా స్కూప్‌ షాట్‌ ప్రతీ ఒక్కర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. సాధారణంగా స్కూప్ షాట్ ఆడే బ్యాట్స్ మాన్ పూర్తిగా మోకాలి మీద కూర్చొని షాట్ ఆడుతాడు. అది పాడిల్ స్కూప్ అయినా, దిల్ స్కూప్ అయినా.. కానీ  ఈ కివీస్ బ్యాట్స్‌మన్‌ పెద్దగా శ్రమించకుండానే ఆడిన స్కూప్‌ షాట్‌ హైలైట్‌ అయ్యింది.

శుక్రవారం న్యూజిలాండ్‌ లిస్ట్‌-ఎ క్రికెట్‌లో భాగంగా ఒటాగో-వెల్లింగ్టన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఒటాగో తరఫున బాటింగ్ చేస్తున్న నీల్‌ బ్రూమ్‌, వెల్లింగ్టన్‌ కెప్టెన్‌ హమిస్‌ బెన్నిట్‌ వేసిన స్లో బౌన్సర్‌ను వికెట్‌ కీపర్‌ తలపై నుంచి ఫోర్‌కు పంపాడు. 

Also read: ఒకే ఓవర్లో 5 వికెట్లు...కర్ణాటక పేసర్ అభిమన్యు మిథున్ అరుదైన రికార్డు

ఈ షాట్ ను చాలా అలవోకగా ఆడడం కొసమెరుపు. పూర్తిగా షాట్ కోసం సంసిద్ధుడైనట్టుగా బాల్ ను బౌండరీకి తరలించిన వైనం అందరిని ఔరా అనిపించింది. తన టైమింగ్‌లో ఎటువంటి పొరపాటు చేయకుండా వికెట్‌ కీపర్‌ పైనుంచి కచ్చితమైన షాట్‌ ఆడాడు. 

ఈ షాట్‌ను చూసినప్రతిఒక్కరు విస్మయంతో అలా నిస్చేష్టులయ్యారు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఒటాగో జట్టు బ్యాటింగ్‌ కు దిగింది. నీల్‌ బ్రూమ్‌... స్కూప్ షాట్ వీరుడు, సెంచరీ చేయగా, మిచ్‌ రెన్విక్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు. 

దాంతో ఒటాగో 262 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేపట్టిన వెల్లింగ్టన్‌ జట్టు 46 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. వెల్లింగ్టన్ బ్యాట్స్ మెన్ మాల‍్కమ్‌ నోపాల్‌ డేవాన్‌ కాన్వేలు అర్థసెంచరీలు చేసారు. వీరిరువురు ఆదుకోవడంతో వెల్లింగ్టన్‌ జోరందుకుంది.  

ఐదో వికెట్‌గా కోల్పోయిన తరువాత వెల్లింగ్టన్‌ వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. చివరి మూడు బంతులకు మూడు పరుగులు చేయాల్సిన తరుణంలో వెల్లింగ్టన్‌ తడబడి మ్యాచ్ ను చేజార్చుకుంది. 

Also read: నిజమైన సక్సెస్ అంటే విజయం సాధించడం కాదు... రాహుల్ ద్రావిడ్ 

హాఫ్ సెంచరీ హీరో నోఫాల్‌ తుదకంటా క్రీజ్‌లో ఉన్నా జట్టును గెలిపించలేకపోయాడు. ఆఖరులో రనౌట్‌ అవడంతో అతని ఇన్నింగ్స్‌ ముగిసింది. ఈ మ్యాచ్‌లో ఒటాగో రెండు పరుగుల తేడాతో గెలిచింది. 

ఇక ఈ మ్యాచ్ కె ప్రత్యేకమైన స్కూప్ షాట్ ను ప్రత్యేకంగా ఒటాగో క్రికెట్ ప్రేమికులతో పంచుకుంది. నీల్‌ బ్రూమ్‌ ఆడిన స్కూప్‌ షాట్‌ను తన ట్వీటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసింది ఒటాగో జట్టు. ఇలాంటి వింతను ఎప్పుడైనా చూశారా... అంటూ వీడియో ను పోస్ట్ చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios